Begin typing your search above and press return to search.

చైతు ఫస్ట్ లవర్ 'దివ్య' దర్శనం

By:  Tupaki Desk   |   1 April 2019 5:40 PM IST
చైతు ఫస్ట్ లవర్ దివ్య దర్శనం
X
మజిలి కౌంట్ డౌన్ దగ్గర పడుతోంది. ఇవాళ్టిని మినహాయిస్తే ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. అక్కినేని అభిమానులకే కాదు చైతు సామ్ లకూ దీని మీద భారీ ఆశలు ఉన్నాయి. ఇందులో ఇద్దరు హీరొయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ప్రమోషన్ లో ప్రతి చోటా సమంతానే హై లైట్ అవుతుండగా మజిలిలో ఫస్ట్ లవర్ గా నటించిన దివ్యాన్షు కౌశిక్ ఎక్కడా అనే సందేహం అందరికి కలిగింది. ఎందుకంటే టీజర్ తో చైతుని లిప్ లాక్ కిస్ తో కిక్ ఇచ్చిన తర్వాత మళ్ళి ట్రైలర్ లోనే కనిపించింది.

అది తప్పిస్తే ఎక్కడా తనను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ కు ఈమె దివ్య దర్శనం కలిగింది. లుక్స్ పరంగా క్యుట్ గా అనిపించే దివ్యాన్షు ట్రైలర్ లో చైతుకు జోడిగా బాగానే కనిపించింది. అయితే తనది బ్రేకప్ లవ్ కాబట్టి కథ పరంగా సాం అంత స్కోప్ దక్కలేదు

అందుకే తనను పక్కన పెట్టి ప్రమోషన్ చేస్తున్నారేమో అన్న టాక్ కూడా వచ్చింది. ఏదైతేనెం మొత్తానికి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ భామ సందడి చేసింది. తన గురించి సామ్ తో సహా ఎవరూ పెద్దగా మాట్లాడలేదు కాని చైతు మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అప్పుడే తను అందరి కళ్ళలో పడింది. ఇప్పుడీ మజిలి కనక హిట్ అయితే దివ్యాన్షుకు మంచి లాంచింగ్ ప్యాడ్ గా ఉపయోగపడుతుంది. చాలా ఎమోషనల్ గా కనిపిస్తున్న మజిలిలో తనదీ కాస్త బరువైన పాత్ర లాగే కనిపిస్తోంది. సో మజిలి సక్సెస్ కావడం అక్కినేని కపుల్ కే కాదు దివ్యాన్షుకు సైతం చాలా అవసరం. చూద్దాం ఇది తనకు ఎంత వరకు ఉపయోగపడుతుందో