Begin typing your search above and press return to search.
మజిలీ.. భలే డీల్ కుదిరిందిగా!
By: Tupaki Desk | 7 March 2019 6:28 AM GMTనాగచైతన్య - సమంతా జంట ఇప్పటికే కలిసి చాలా సినిమాల్లో నటించారు కానీ వారు నటిస్తున్న కొత్త సినిమా 'మజిలీ' మాత్రం ఇద్దరి కెరీర్లలో ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుంది. వివాహం తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడం ఒక విశేషం అయితే.. ఇద్దరూ భార్యాభర్తలుగా సినిమాలో నిజజీవిత పాత్రలు పోషించడం మరో విశేషం. ఇక ఈ ప్రోమోస్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుండడంతో బిజినెస్ సూపర్ గా జరుగుతోందట.
శాటిలైట్.. డిజిటల్.. హిందీ డబ్బింగ్ రైట్స్ మొత్తంగా చూసుకుంటే రూ. 12.5 కోట్ల బిజినెస్ జరిగిందట. శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ రూ. 5 కోట్ల కు చేజిక్కించుకుందట. మరోవైపు డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వారు 3.5 కోట్ల రూపాయలకు ఫైనలైజ్ చేసుకున్నారట. ఇక హిందీ డబ్బింగ్ హక్కులను 4 కోట్ల రూపాయలకు డీల్ కుదిరిందట. అసలు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ తో సంబంధం లేకుండానే 12.5 కోట్ల రూపాయలు రికవర్ కావడం నిర్మాతలు సంతోషాన్నిచ్చే అంశమే.
షూటింగ్ పార్ట్ అంతా పూర్తి చేసుకున్న 'మజిలీ' ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఏప్రిల్ 5 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీత దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి.. హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.