Begin typing your search above and press return to search.

టాలీవుడ్ రూల్స్ ని తూచ్ అనేశారా!

By:  Tupaki Desk   |   3 May 2019 4:23 AM GMT
టాలీవుడ్ రూల్స్ ని తూచ్ అనేశారా!
X
ఏప్రిల్ నుంచి టాలీవుడ్ సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ కాని శాటిలైట్ ప్రసారం కాని 60 రోజుల తర్వాతే జరగాలన్న స్వీయ నిబంధన మన నిర్మాతల సమాఖ్య విధించుకున్న సంగతి తెలిసిందే. ఆ నెలలో ఫస్ట్ వచ్చిన మజిలి జూన్ లోనే వస్తుందన్న అంచనాలో అభిమానులు ప్రేక్షకులు ఉన్నారు. అయితే అమెజాన్ ఇండియా షాక్ ఇచ్చింది.

ఈ నెల 10న తమ వీడియో స్ట్రీమింగ్ యాప్ లో మజిలిని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించేసింది. అంటే సరిగ్గా 35 రోజులకు టెలికాస్ట్ చేసినట్టు అవుతుంది. మరి అరవై రోజుల కండిషన్ గురించి మాటేమిటి అంటే దానికి సమాధానం ప్రొడ్యూసర్లు చెప్పాలి. ఒకవేళ షూటింగ్ మొదలుపెట్టే సమయానికే జరిగిన ఒప్పందం కాబట్టి మజిలి ఆ వింగ్ లోకి రాదా లేక అమెజాన్ తన పద్ధతిలో రాజీ ఉండదని చెప్పాలనుకుందా ఇంకా క్లారిటీ లేదు

తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా మజిలి చాలా చోట్ల ఇంకా డీసెంట్ రన్ ని కొనసాగిస్తూనే ఉంది. సుమారు 35 కోట్ల దాకా షేర్ రాబట్టి చైతు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాదు చైతు నెక్స్ట్ మూవీస్ మార్కెట్ కి గ్యారెంటీ గా నిలిచింది అలాంటిది ఇంత త్వరగా ఆన్ లైన్ లోకి వచ్చేస్తే అర్ధ శతదినోత్సవం దాకా రన్ అవుతుంది అనుకున్న ప్రధాన కేంద్రాలలో తీవ్ర ప్రభావం పడుతుంది. దీని ప్రకారం చూస్తే ఏప్రిల్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యే సినిమాలకు మాత్రమే అరవై రోజుల సూత్రం వర్తించేలా ఉంది. ఈ లెక్కన ఇప్పటికే నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని త్వరగానే స్ట్రీమింగ్ లో వస్తాయన్న మాట