Begin typing your search above and press return to search.

మజిలీ నిజం - అవన్నీ అబద్దం

By:  Tupaki Desk   |   23 March 2019 5:40 PM IST
మజిలీ నిజం - అవన్నీ అబద్దం
X
ఇవాళ ఓ మీడియా వర్గంలో సెన్సార్ ఆలస్యం అయ్యే అవకాశంతో పాటు రాజకీయ వాతావరణం నెలకొన్న నేపధ్యంలో మజిలి వాయిదా పడొచ్చనే వార్తలు గట్టిగానే షికారు చేశాయి. ఇంకా ఫినిషింగ్ ఏదో బాలన్స్ ఉందని చైతు సామ్ లు కొన్ని మార్పులు కోరారని ఇలా రకరకాలుగా ప్రచారం జరిగింది. వీటిని పూర్తిగా ఖండిస్తూ మజిలి నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అధికారిక ప్రకటన ఇచ్చింది.

మజిలి వాయిదా పడే ఛాన్స్ లేదని సర్వం సిద్ధం చేసుకుని ఏప్రిల్ 5 విడుదల కావడం ఖయమంటూ పేర్కొంటూ వాయిదా గురించి వార్తలన్నీ పుకార్లుగా కొట్టి పారేస్తూ వాటిని నమ్మవద్దని కోరింది. దీంతో పోస్ట్ పోన్ అయ్యిందేమోనన్న టెన్షన్ తో ఉన్న అభిమానులకు ఊరట కలిగింది. అసలే చైతుకి గత ఏడాది కలిసి రాలేదు. కొత్త ఏడాది బోణీ అధిరిపోవాలని ఎదురు చూస్తున్నారు

సో మజిలి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఏప్రిల్ 5 వచ్చేస్తుంది. నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న మజిలి సున్నితమైన భార్యా భర్తల ఎమోషన్స్ మీద రూపొందినట్టుగా టీజర్ ఆడియోని బట్టి అర్థమైపోయింది. నిజ జీవితంలో జంటగా మారిన చైతు సామ్ లు మనం తర్వాత చేస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ మజిలిని చాలా స్పెషల్ గా ఫీలవుతున్నారు.

పోలింగ్ కు సరిగ్గా ఆరు రోజులు ముందు విడుదల అవుతున్న మజిలికి దాని ప్రభావం కొంత ఉండే అవకాశం ఉన్నప్పటికీ కంటెంట్ జనాన్ని థియేటర్ దాకా రప్పిస్తుందని యూనిట్ ధీమాగా ఉంది. ఇది కనక హిట్ కొట్టేస్తే ఆపై వారాలు క్యు కట్టిన భారీ సినిమాలకు బూస్ట్ ఇచ్చినట్టే.