Begin typing your search above and press return to search.
'మజిలీ' ప్రీబిజినెస్ ఎంత?
By: Tupaki Desk | 2 April 2019 6:55 AM GMTరియల్ లైఫ్ ప్రేమికులు చై- సామ్ పెళ్లి తర్వాత తెరపై ఎలా కనిపించబోతున్నారు? భార్యాభర్తలుగా నటించారు కాబట్టి ఈ కొత్త జంట ఎలా కనిపించబోతోంది? అన్న క్యూరియాసిటీ అక్కినేని అభిమానుల్లో ఉంది. ఈ జంట నటించిన `మజిలీ` టీజర్ - ట్రైలర్ ఆకట్టుకున్నాయి. గోపిసుందర్ పాటలకు చక్కని ఫీడ్ బ్యాక్ వచ్చింది. అందుకే మజిలీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రియల్ లైఫ్ ప్రేమకథల్ని తెరపై చూపించే ఆసక్తితో శివ నిర్వాణ మరో కొత్త ఎటెంప్ట్ చేశారనే ట్రైలర్ చెబుతోంది. మజిలీ ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్ కట్టి పడేయడంతో మూవీపైనా అంచనాలు పెరిగాయి. ఈ శుక్రవారం మజిలీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ట్రేడ్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 22కోట్ల మేర బిజినెస్ సాగించిందని తెలుస్తోంది. నైజాం - 6కోట్లు - సీడెడ్ -2.50 కోట్లు - తూ.గో జిల్లా -1.44కోట్లు - కృష్ణ-1.28 కోట్లు - గుంటూరు-162కోట్లు - ప.గో జిల్లా- 1.12కోట్లు - నెల్లూరు-0.70కోట్ల మేర బిజినెస్ సాగింది. ఏపీ-తెలంగాణ కలుపుకుని 16.64కోట్లకు రైట్స్ ని కొనుగోలు చేశారట. రెస్ట్ అఫ్ ఇండియా - 1.50కోట్లు - గల్ఫ్-1.98 కోట్ల మేర బిజినెస్ పూర్తయిందని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 21.14కోట్ల బిజినెస్ పూర్తయింది.
`మజిలీ` చిత్రాన్ని ఇటు తెలుగు రాష్ట్రాలు సహా అటు ఓవర్సీస్ లోనూ భారీగానే రిలీజ్ చేసేందుకు షైన్ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రాన్ని అమెరికాలో 150 పైగా లొకేషన్లలో రిలీజ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా - న్యూజిల్యాండ్ - జెర్మనీ - కెనడా లాంటి చోట్ల రిలీజ్ చేస్తుండడం ఆసక్తికరం. మొత్తానికి చైతూ సినిమా హిట్టు అన్న టాక్ తెచ్చుకుంటే తొలి వీకెండ్ నాటికే మెజారిటీ కలెక్షన్లను సాధించే వీలుంటుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మండే ఎండలు - పరీక్షలు - ఎన్నికలు అంటూ హడావుడి కనిపిస్తోంది కాబట్టి ఇది కొంతవరకూ మజిలీ కలెక్షన్లపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.