Begin typing your search above and press return to search.
వైరస్ ఎఫెక్ట్ తో వకీల్ సాబ్ లో వచ్చిన మేజర్ మార్పు
By: Tupaki Desk | 12 Jun 2020 10:30 AM GMTపవన్ కళ్యాణ్ 26వ చిత్రం వకీల్ సాబ్ ఈ ఏడాదిలో విడుదల చేయాలని చాలా పట్టుదలతో ఉన్నారు. థియేటర్లు ఓపెన్ చేసిన వెంటనే కాకున్నా కనీసం ఈ ఏడాది చివరి వరకు అయినా వకీల్ సాబ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. ఆ మొత్తంను ఆగస్టు నుండి మొదలు పెట్టి పూర్తి చేయబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
గత మూడు నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో దర్శకుడు మరియు నిర్మాత స్క్రీన్ ప్లే మరియు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి షూటింగ్ తక్కువ రోజుల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేశారట. స్క్రిప్ట్ మార్పులో భాగంగా శృతి హాసన్ తో అనుకున్న పాత్ర నిడివి తగ్గించారట. పింక్ లో అసలు ఆ పాత్ర ఉండదు. కాని తెలుగులో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం అంటూ క్రియేట్ చేశారు. ఆ పాత్రకు సంబంధించిన నిడివిని ఇప్పుడు సగానికి పైగా తగ్గించారట.
వకీల్ సాబ్ చిత్రం కోసం శృతి హాసన్ కేవలం వారం నుండి పది రోజులు మాత్రమే వర్క్ చేయబోతుందట. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో ఈ సినిమా షూట్ లో శృతి హాసన్ పాల్గొనాల్సి ఉంది. కేవలం వారం రోజు షూటింగ్ అయినా కూడా దాదాపుగా 50 లక్షల రూపాయలను ఆమె పారితోషికంగా తీసుకోబోతున్నట్లుగా చెబుతున్నారు. పవన్ శృతిహాసన్ ల కాంబో సీన్స్ ఆసక్తికరంగా ఎంటర్ టైన్ మెంట్ గా ఉంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.