Begin typing your search above and press return to search.

మేజర్ సందీప్ జయంతి సందర్భంగా 'మేజర్' గ్లిమ్స్ వదిలిన మహేష్..!

By:  Tupaki Desk   |   15 March 2021 11:04 AM GMT
మేజర్ సందీప్ జయంతి సందర్భంగా మేజర్ గ్లిమ్స్ వదిలిన మహేష్..!
X
26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ''మేజర్''. టాలెంటెడ్ హీరో అడవి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. 'గూఢచారి' ఫేమ్ శ‌శి కిర‌ణ్‌ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ సమర్పణలో మహేష్ బాబు-జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నేడు (మార్చి 15) మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ‘మేజర్‌’ గ్లిమ్స్ ని విడుదల చేశారు.

'మేజర్‌' గ్లిమ్స్ లో ఓ బిల్డింగ్ పూర్తిగా తగలబడి పోతుండగా.. సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రధారి అడవి శేష్ మంటల మధ్యలో నిలబడి ఉన్నాడు. అదే సమయంలో మేజర్ సందీప్ నువ్వు అక్కడ ఉన్నావా అంటూ వాయిస్ వినిపిస్తుంది. ఈ సందర్భంగా మార్చి 28న టీజర్ ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. కాగా, 2006 నవంబర్‌ 26న మంబయి నగరంలోని తాజ్ హోటల్ లో జరిగిన మారణహోమంలో మేజర్ సందీప్ వీరమరణం పొందారు. అతను ఎలా ఈ లోకాన్ని విడిచారు అనేది కాకుండా ఎలా అతను జీవించాడు అనేది 'మేజర్' సినిమాలో చూపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో శేషు అచ్చంగా మేజర్‌ సందీప్‌ ను పోలి ఉండడం అభిమానులను ఆకట్టుకుంది. ఇందులో తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల మరియు బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'మేజర్' చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో జులై 2న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.