Begin typing your search above and press return to search.
'మేజర్' కు అన్ని కోట్ల బిజినెస్ జరిగిందా..??
By: Tupaki Desk | 11 Jun 2022 10:44 AM GMTవర్సటైల్ యాక్టర్ అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''మేజర్''. ముంబై 26/11 ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బయోపిక్.. బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
'మేజర్' సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందనతో దూసుకుపోతున్న ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారంలోనే రూ. 50 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి సంచలనం సృష్టించింది. సక్సెస్ ఫుల్ గా రెండో వారంలో అడుగుపెట్టింది.
తొలి నుంచే అందరి దృష్టిని ఆకర్షించిన 'మేజర్' భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ అందుకుంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి లాభాల బాటలో పయనిస్తోంది. సెకండ్ వీక్ లోనూ స్ట్రాంగ్ గా నిలబడటంతో.. రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్ళు ఆశించవచ్చు.
'మేజర్' సినిమా రూ. 60 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. థియేట్రికల్ 27 కోట్లు ఉంటే.. నాన్ థియేట్రికల్ వ్యాపారం 33 కోట్లు జరిగింది. అందులో డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ 16 కోట్లకు తీసుకుంది. హిందీ శాటిలైట్ హక్కులు 8 కోట్లకు అమ్ముడైతే.. తెలుగు శాటిలైట్ ను 7 కోట్లకు.. మలయాళ శాటిలైట్ 1 కోటికి విక్రయించారు. మ్యూజిక్ రైట్స్ రూపంలో కోటి దాకా వచ్చింది.
మొత్తం కలుపుకుంటే 'మేజర్' సినిమా మొత్తం వ్యాపారం 60 కోట్ల వరకూ జరిగింది. ఇక ఈ చిత్రానికి 35 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ అయిందని సమాచారం. మేకింగ్ - ప్రింట్ మరియు పబ్లిసిటీ కలుపుకుంటేనే అంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు మూవీ బాక్సాఫీస్ లెక్కలు.. పెట్టుబడి మరియు బిజినెస్ చూసుకుంటే.. మేజర్ మేకర్స్ భారీగా లాభాలను ఆర్జించారని తెలుస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు 'మేజర్' సినిమా నిర్మాణంలో భాగం పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అంత క్రేజ్ ఏర్పడటానికి మహేష్ స్టార్ డమ్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ - జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్ - ఏ ప్లస్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.
'మేజర్' చిత్రంలో అడవి శేష్ సరసన సయూ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. శోభిత దూళిపాళ్ల కీలక పాత్ర పోషించగా.. ప్రకాశ్ రాజ్ - రేవతి - మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రలు చేశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు రాశారు. హీరో శేష్ కథ - స్క్రీన్ ప్లే అందించారు.