Begin typing your search above and press return to search.
ఆపరేషన్ కి రెడీ అవుతున్న 'మేజర్'
By: Tupaki Desk | 4 Jan 2022 8:30 AM GMTమొదటి నుంచి కూడా అడివి శేష్ డిఫరెంట్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. హీరోగా కొత్త కాన్సెప్టులు ఎంచుకుంటూ ఒక్కో మెట్టూ ఎదుగుతున్నాడు. క్షణం .. గూఢచారి .. ఎవరు సినిమాలు ఆయన సక్సెస్ గ్రాఫ్ ను పెంచేశాయి. అంతేకాదు .. అడివి శేష్ సినిమాలు రోటీన్ కి భిన్నంగా ఉంటాయనే టాక్ ను తీసుకుని వచ్చాయి. తెరపై పాత్ర మాత్రమే కనిపించేలా చేయగలిగే ఆర్టిస్టుల జాబితాలో ఆయన పేరు కూడా చేరిపోయింది. అలాంటి అడివి శేష్ ఇప్పుడు 'మేజర్' సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.
కొంతకాలం క్రితం ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ పై ఉగ్రవాదుల దాడి జరిగింది. అప్పుడు ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్నవారిని రక్షించడానికి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కీలకమైన పాత్రను పోషించారు. ఆయన జీవితం ... ఆ సంఘటనను ప్రధానంగా తీసుకుని చిత్రీకరించిన సినిమా ఇది. ప్రధానమైన పాత్రను అడివి శేష్ పోషించగా, శోభిత ధూళిపాళ .. సయీ మంజ్రేకర్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. ఇక కీలకమైన పాత్రను ప్రకాశ్ రాజ్ పోషించాడు. ఆయన పాత్ర కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.
ముంబైలో జరిగిన ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. అందువలన వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ముందుగా తెలుగు .. హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అడివి శేష్ హిందీలోనూ తన పాత్రకి డబ్బింగ్ ను పూర్తి చేశాడు. అనుకున్నట్టుగా ఈ సినిమా డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేసినందుకు అడివి శేష్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, డబ్బింగ్ చెప్పే విషయంలోను తను చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా చెప్పాడు.
"సినిమా అనుకున్నట్టుగా పూర్తి చేయడానికి కూడా మేము చాలా కష్టపడవలసి వచ్చింది. ఈ సినిమాకి పనిచేస్తున్న వాళ్లంతా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకున్నారు. గుంపులో కలవడాలు చేయకుండా .. మాస్కు ధరిస్తూ .. శానిటైజర్ వాడుతూ ఎవరికి వారు జాగ్రత్తలు పాటిస్తూ వచ్చారు. అదే జాగ్రత్తను డబ్బింగ్ విషయంలోను తీసుకున్నాము. ఎందుకంటే ఎక్కడ పొరపాటు జరిగినా సినిమా వాయిదా పడే పరిస్థితి వస్తుంది. అందుకే అంత కేర్ ఫుల్ గా ఉన్నాము" అని ఆయన చెప్పుకొచ్చాడు. మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు.