Begin typing your search above and press return to search.
'మేజర్' రిలీజ్ డేట్ వచ్చేసింది
By: Tupaki Desk | 4 Feb 2022 8:30 AM GMTవిబిన్నమైన చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు యువ హీరో అడివి శేష్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `మేజర్`. 2008లో జరిగిన ముంబై లో జరిగిన ఉగ్రదాడిలో హీరోగా పోరాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. `గూఢచారి` ఫేమ్ శశికిరణ్ తిక్క ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఇండియా, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర తో కలిసి హీరో సూపర్ స్టార్ మహేష్‌బాబు ఈ మూవీని నిర్మిస్తున్నారు.
శోభిత దూలిపాల, సయీ మంజ్రేకర్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, రేవతి, మురళీశర్మ కీలక పాత్రలు పోషించారు. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న వరల్డ్ వైడ్ గా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే కరోనా థర్డ్ వేవ్ మొదలుపకావడం.. భారీ చిత్రాల రిలీజ్ లు వరుసగా వాయిదా పడటంతో `మేజర్` చిత్రాన్ని కూడా వాయిదా వేస్తున్నట్టుగా చిత్ర బృందం ప్రకటించింది.
దాదాపు ఏడాది కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్నఈ మూవీ ఎట్టకేలకు ఫైనల్ రిలీజ్ డేట్ ని తాజగా చిత్ర బృందం సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. బిగ్ స్క్రీన్స్ లో మేజర్ యొక్క అసలైన ఎక్స్‌పీరియన్స్ ని ఆస్వాదించండి. మే 27న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం` అంటూ చిత్ర బృందం రిలీజ్ డేట్ ని ప్రకటించింది. దీంతో ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు, సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉగ్ర మూకల్ని ఎరిపారేసే సమరంలో వీరేచితంగా పోరాడిన రియల్ హీరో కథతో తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ మూవీ ఎలా వుండబోతోందా? అని అందిరిలోనూ ఆసక్తి మొదలైంది.
దేశం కోసం ప్రాణాలని సైతం లెక్కచేయక పోరాడిన వీర మరణం పొందిన మేజర్ ఉన్నికృష్ణన్ కథగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకింగ్ పరంగా సినిమా హాలీవుడ్ యాక్షన్ చిత్రాన్ని తలపిస్తుండటంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ థియేటర్లలోకి వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు ఫైనల్ గా తెరదించుతూ ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో మే 27న విడుదల చేస్తున్నారు. హీరో అడివి శేష్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ అతని కెరీర్ ని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.