Begin typing your search above and press return to search.
రక్షణ మంత్రి ఇలాకాలో మేజర్ టీమ్ హల్ చల్
By: Tupaki Desk | 6 May 2022 11:30 AM GMTఈ ఏడాది విడుదలవుతున్న సినిమాల్లో మోస్ట్ పాపులర్ ఫిల్మ్ 'మేజర్'. యంగ్ హీరో అడివి శేష్ హీరోగా నటించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ కు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. అత్యంత ధైర్యవంతుడు, సాహసి.. దేశ రక్షణ కోసం ప్రాణాలని సైతం పణంగా పెట్టిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ముంబై తాజ్ హోటల్ ఎటాక్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ , జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించారు.
సయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాళ్ల, ప్రకాష్ రాజ్, మురళీశర్మ కీలక పాత్రల్లో నటించారు. జూన్ 3న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ సమయం దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషనల్ ఈవెంట్స్ ని ప్రారంభించేశారు. ఈ సందర్భవంగా మేజర్ ప్రామిస్ అంటూ ఓ వీడియోని సాయంత్రం విడుదల చేస్తున్నట్టుగా చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ మూవీ ప్రొడ్యూసర్స్, అండ్ హీరోచ డైరెక్టర్ ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ని ఢిల్లీలో ప్రత్యేకంగా కలిసింది.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్ గ్లింప్స్ సినిమా అంచనాల్ని పెంచేసి ఓ హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీని చూస్తున్న ఫీలింగ్ ని కలిగించడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సినిమాని ప్రేక్షకులకు మరింత చేరువ చేయడం కోసం ప్రచార కార్యక్రమాలని రూపొందించిన టీమ్ మే 1న ఆదివారం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని ప్రత్యేకంగా కలిసింది. ఈ సందర్భంగా మేజర్ మూవీ ట్రైలర్ ని ప్రదర్శించారు. రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ ధైర్య సాహసాల గురించి మాట్లాడుకున్నారు.
ఇదే క్రమంలో సినిమా స్లోగన్ ని విడుదల చేశారు. పూర్తి లెల్లని కాన్ వాస్ పై త్రివర్ణ పతాకం కలర్ లలో 'జాన్ దూంగా దేశ్ నహీ' అనే స్లోగన్ ని ఆవిష్కరించారు. ఇది మేజర్ సందీప్ పాటించిన సిద్ధాంతం అని, ఆ స్లోగన్ ఆయన ఆత్మను, భావోద్వేగా కోణంలో తను ప్రపంచాన్ని చూసిన కోణాన్ని ఇది హైలైట్ చేస్తుందన్నారు. అంతే కాకుండా ట్రైలర్ చూసిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చిత్ర బృందం ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని ప్రశంసించారు.
అత్యంత ధైర్యవంతుడైన ఇండియన్ హీరో కథని వెండితెరపై ఆవిష్కరించినందుకు హీరో అడివి శేష్‌ని, దర్శకుడు శశికిరణ్ తిక్కను ఈ సందర్భంగా అభినందించారాయన. త్వరలోనే రక్షణ మంత్రి ఫ్యామిలీ కోసం ప్రత్యేకంగా మేజర్ ప్రివ్యూని ఏర్పాటు చేయనున్నారట.
బ్రేవ్ సోల్జర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మేజర్' టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ట్రైలర్ కూడా ఆ అంచనాల్ని మరింత పెంచుతుందని చెబుతున్నారు. తెలుగుతో పాటు హిందీలో ఏక కాలంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మలయాళంలోనూ విడుదల చేయబోతున్నారు. భారీ స్థాయిలో జూన్ 3న విడుదల కానున్న ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీశర్మ, అనీష్ కురువిల్ల తదితరులు నటిస్తున్నారు.

We showed the Honorable Defence Minister Rajnath Singh Ji The #MajorTrailer in Delhi. And he unveiled…
Jaan Doonga Desh Nahi - जान दूँगा देश नहीं