Begin typing your search above and press return to search.
సైఈ మంజ్రేకర్ ఫస్ట్ లుక్ అండ్ 'మేజర్' టీజర్ అప్డేట్..
By: Tupaki Desk | 3 April 2021 12:36 PM GMT26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ''మేజర్''. టాలెంటెడ్ యువ హీరో అడవి శేష్ ఇందులో టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. తెలుగమ్మాయి శోభితా దూళిపాళ్ల మరియు బాలీవుడ్ బ్యూటీ సైఈ మంజ్రేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ - ఫస్ట్ గ్లిమ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా సైఈ మంజ్రేకర్ ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.
'అతని పట్ల ఆమెకున్న ప్రేమ.. దేశం పట్ల అతనికున్న ప్రేమలాగే మనోహరమైనది' అంటూ విడుదల చేసిన ఈ పోస్ట్ కార్డ్ లో సైఈ మంజ్రేకర్ - శేష్ స్కూల్ డ్రెస్ లో కనిపిస్తున్నారు. 'డియర్ సందీప్.. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ ఎలా ఉంది? మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు? మన స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి.. లవ్ యూ' అంటూ ఆమె రాసిన లెటర్ ని చూపించారు. ఈ సందర్భంగా శేష్ ట్వీట్ చేస్తూ.. ''లెటర్ లోప్రతి పదం సింపుల్ గా అనిపిస్తుంది.. కానీ చాలా విలువైనది. ఆమె అతన్ని స్కూల్ లో కలిసింది.. ఆమె అతనితో ఒక జీవితం కావాలని కలలు కనింది.. ఆమె రాయగలిగే దానికంటే చాలా ఎక్కువ ఫీల్ అయింది'' అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఏప్రిల్ 12న టీజర్ ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
కాగా, 2006 నవంబర్ 26న మంబయి నగరంలోని తాజ్ హోటల్ లో టెర్రరిస్టులు జరిప్పిన మారణహోమంలో మేజర్ సందీప్ వీరమరణం పొందారు. అతను ఎలా ఈ లోకాన్ని విడిచారు అనేది కాకుండా.. ఎలా జీవించాడు అనేది ఈ 'మేజర్' చిత్రంలో చూపించబోతున్నారు. మేజర్ సందీప్ పాత్రలో నటించడానికి శేష్ బాగా కష్టపడ్డాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ - మురళీశర్మ కీలక పాత్రల్లో నటించారు. అబ్బూరి రవి ఈ చిత్రానికి సంభాషణలు రాస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్నారు. 'మేజర్' చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో జులై 2న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.