Begin typing your search above and press return to search.
'జనగణమన'.. 'మేజర్' లోని స్ఫూర్తిదాయక గీతం..!
By: Tupaki Desk | 2 Jun 2022 5:30 AM GMTవర్సటైల్ స్టార్ అడివి శేష్ నటించిన లేటెస్ట్ యాక్షన్-డ్రామా ''మేజర్'' రేపు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో ప్రాణాలు అర్పించిన వీరజవాను మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది.
మరికొన్ని గంటల్లో ఈ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వస్తుందనగా.. తాజాగా 'జనగణమన' అనే థర్డ్ సింగిల్ ని రిలీజ్ చేశారు. 'జయహే జయహో.. ఎగిరే కలలో.. రగిలే రవివో.. అలిసే బరిలో..' అంటూ సాగిన ఈ దేశభక్తి గీతం ఉద్వేగభరితంగా ఉంది. సైనికుడిగా ఉండటమంటే ఏమిటి? సోల్జర్ గా అవ్వాలని ఎందుకు అనుకుంటారు? అనే ప్రశ్నలకు సమాధానం ఈ పాటను రూపొందించారు.
చిన్నతనంలో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో దేశం కోసం సేవ చేయడానికి ప్రేరేపించిన మొదటి క్షణం.. ముంబై టెర్రరిస్టుల దాడిలో జరిగిన విషాద సంఘటన సమయంలోనే సైన్యంలో చేసిన ప్రయాణాన్ని ఈ పాటలో చూడొచ్చు. సైనికుడి గురించి తన తండ్రి అడిగిన ప్రశ్నకు మేజర్ ఇచ్చిన సమాధానం ఆలోచింపజేస్తుంది.
మేజర్ జీవిత ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకంగా భావోద్వేగంగా ఉంటుందని ఈ పాటలో తెలుస్తోంది. 'మేజర్' సినిమాకు మధురమైన బాణీలు సమకూర్చిన శ్రీచరణ్ పాకాల.. ఇప్పుడు 'జన గణ మన' గీతానికి కూడా అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు. రాజీవ్ భరద్వాజ్ దేశభక్తిని రేకెత్తించే సాహిత్యాన్ని అందించగా.. టోజన్ టోబి ఈ పాటను ఆలపించారు.
'మేజర్' చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించగా.. శేష్ కథ - స్క్రీన్ ప్లే అందించారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఇందులో శోభిత ధూళిపాళ్ల - సయీ మంజ్రేకర్ - ప్రకాశ్ రాజ్ - రేవతి - మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ - ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంస్థలు కలిసి ఈ పాన్ ఇండియా బయోపిక్ ని నిర్మించారు. తెలుగు మలయాళ హిందీ భాషల్లో రేపు జూన్ 3న ''మేజర్'' మూవీ రిలీజ్ కాబోతోంది.