Begin typing your search above and press return to search.
మహేష్ 'మేజర్' కి దిల్ రాజు సైడ్ ఇచ్చేనా? లేదా?
By: Tupaki Desk | 1 March 2022 4:42 AM GMTటాలీవుడ్ లో ఈ నెల నుండి మొదలుకుని వరుసగా సినిమాలు మూడు నెలల పాటు బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి. నిర్మాతలు ముందస్తుగా చర్చించి వారంకు ఒక్కటి చొప్పున విడుదలకు ప్లాన్ చేశారు. కొన్ని సినిమాలు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో మరో సినిమా తో పోటీ పడాల్సి వస్తుంది. మీడియం బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ ఫైట్ కు సిద్దం అవుతున్నాయి. అందులో ప్రథానంగా ఎఫ్ 3 మరియు మేజర్ సినిమాలుగా చెప్పుకోవచ్చు.
ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు విడుదల కాబోతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ క్లాష్ తప్పదేమో అనిపిస్తుంది. ఈ సమయంలో రెండు సినిమా ల మేకర్స్ మాత్రం చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఎఫ్ 3 మరియు మేజర్ రెండు సినిమా లు కూడా డిఫరెంట్ జోనర్ కు చెందినవి. పూర్తిగా ఒకదానితో మరోటి సంబంధం లేదు. కనుక ఏ సినిమా ప్రేక్షకులు ఆ సినిమాకు ఉంటారు. కలెక్షన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు అంటున్నారు.
కనీసం ఓపెనింగ్ కలెక్షన్స్ పై కూడా ప్రభావం ఉండక పోవచ్చు అనే నమ్మకంతో ఉన్నారు. అయితే దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన సినిమాలు విడుదలకు సిద్దం అయిన సమయంలో మరో సినిమా విడుదల అవ్వడం అంటే రిస్క్ అంటారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ థియేటర్లు ఆయన మరియు ఆయనకు చెందిన వారి ఆదీనంలో ఉంటాయని అంటారు. తన సినిమాకు సరిపోయిన తర్వాత మాత్రమే థియేటర్లకు ఇతర సినిమాలకు దిల్ రాజు ఇస్తాడని అంటారు.
దిల్ రాజు ఇప్పుడు 'మేజర్' సినిమా కు ఏ స్థాయిలో థియేటర్లు ఇచ్చే అవకాశం ఉందని అనేది చర్చనీయాంశంగా మారింది. మహేష్ బాబు సినిమా అయితే ఖచ్చితంగా దిల్ రాజు అందుకు తగ్గ సినిమా ఇచ్చే వాడు. కాని ఆయన నిర్మించిన సినిమా అయినా కూడా మొదటి ప్రియారిటీని తన ఎఫ్ 3 సినిమాకే చూసుకుంటాడు. మెజార్టీ థియేటర్లను తన ఎఫ్ 3కి కేటాయించే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు.
మేజర్ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఉత్తరాదిన ఈ సినిమాకు కాస్త గట్టి పోటీ తప్పదేమో అంటున్నారు. ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎఫ్ 3 నుండి ఎంత కాదన్నా పోటీ మాత్రం తప్పక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దిల్ రాజు థియేటర్లను కేటాయించేదాన్ని బట్టి వసూళ్లు ఉంటాయని బాక్సాఫీస్ నిపుణులు అంటున్నారు.
మహేష్ బాబు నిర్మాణంలో రూపొందిన మేజర్ సినిమా రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ ఆధారంగా రూపొందిన విషయం తెల్సిందే. అడవి శేషు ఈ సినిమా లో మేజర్ పాత్రలో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ లో సోనీ పిక్చర్స్ వారు పోటీ ఉన్నా కూడా భారీగానే రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఇక్కడ మహేష్ బాబు ఏమైనా పావులు కదిపి భారీ రిలీజ్ కు ప్లాన్ చేస్తాడేమో చూడాలి. దేశ భక్త మూవీ కనుక మినిమం టాక్ దక్కించుకుంటే ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు.