Begin typing your search above and press return to search.

స్పెష‌ల్ స్టోరి: బయోపిక్ మేకోవ‌ర్లు బిగ్ ఫెయిల్

By:  Tupaki Desk   |   1 April 2020 12:30 AM GMT
స్పెష‌ల్ స్టోరి: బయోపిక్ మేకోవ‌ర్లు బిగ్ ఫెయిల్
X
బ‌యోపిక్ అంటేనే ఓ స‌వాల్. వాటిలో న‌టుడి లుక్ తో పాటు ఆహార్యం ప‌ర్ఫెక్ట్ గా కుద‌రాలి. అచ్చంగా ఆ ప్ర‌ముఖుడి రూపానికి స‌రిపోల‌క‌పోయినా సుమారు పోలిక‌ల‌తో ఇంచుమించుగా అయినా ఉండాలి. అలా కుద‌ర‌ని బ‌యోపిక్ ల జాబితా తిర‌గేస్తే.. చాలానే ఉన్నాయి.

ప్రేక్ష‌కులు ఎప్పుడూ బయోపిక్ చూసినప్పుడు ఆ క్యారెక్టర్ లో న‌టించిన‌ ముఖాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఇది ఆ ప్ర‌ముఖ‌ వ్య‌క్తి రూపంతో న‌టుడి రూపం పోలి ఉందా లేదా? కేశాలంకరణ.. వ్య‌క్తిత్వ‌ లక్షణాల.. డ్రెస్సింగ్ లేదా కొన్ని పేటెంట్ యాక్టివిటీస్ ప‌రంగా స‌ద‌రు ప్ర‌ముఖునితో పోలి ఉండాలి. ఆ పాత్ర‌లో అవ‌న్నీ ప్ర‌తిబింబించాలి.

స్వాతంత్య్ర‌ సమరయోధుడు భగత్ సింగ్ నుండి క్రీడాకారిణి మారీ కోమ్ వరకు.. ప్రతిఒక్కరికీ వారి కంటూ ఒక స్వ‌గ‌తం ఉంది. అయితే కొన్నిసార్లు ఆయా పాత్ర‌ల చిత్ర‌ణ‌ల్లో నటుడు లేదా నటి చాలా భిన్నమైన మేకోవ‌ర్ ని కలిగి క‌నిపించారు. వాస్త‌విక‌త‌తో అచ్చంగా పోలి తెర‌పై క‌నిపించ‌లేదు.

ఈ జాబితాలో కొంద‌రిని ప‌రిశీలిస్తే..

1. రాజా రవివర్మగా రణదీప్ హుడా

చిత్రకారుడు రాజా రవివర్మ చాలా భిన్నమైన వ్యక్తిత్వం కల‌వాడు. ర‌వివ‌ర్మ‌ నిజ జీవితంలో ఎలా కనిపించేవారో అచ్చం అలా రణదీప్ హుడా మేకోవర్‌ సరిపోలలేదు. అయితే ఆ లోటుపాట్ల‌ను ర‌ణ‌దీప్ నటనలో క‌వ‌ర్ చేయ‌గ‌లిగారు.

2. జాన్ అబ్రహాం మాన్య సర్వ్

`షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా` సీక్వెల్ లో జాన్ అబ్రహాన్ గ్యాంగ్ స్టర్ మాన్య సర్వ్ పాత్ర పోషించాడు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల్లో విస్త్ర‌తంగా చర్చనీయాంశమైంది. జాన్ ఒరిజిన‌ల్ రూపం నిజమైన పాత్రను త‌ల‌పించ‌లేదు. అయితే అత‌డి న‌ట‌న‌కు పేరొచ్చింది.

3. సబ్రినా లాల్ గా విద్యాబాలన్

విల‌క్ష‌ణ నటి విద్యాబాలన్ `నో వన్ కిల్డ్ జెస్సికా` చిత్రంలో జెస్సికా లాల్ సోదరి సబ్రినా లాల్ పాత్రను పోషించింది. ఆమె మాట్లాడే విధానం ... రూపం నిజమైన సబ్రినాతో సరిపోలలేదు.

4. మేరీ కోమ్ గా ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా మేరీ కోమ్ బయోపిక్ సైలెంట్ హిట్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ కోసం పీసీ కఠినమైన శిక్షణ పొందింది. ఈ చిత్రం కోసం త‌ను చాలా శ్రద్ధను కనబరిచింది. కానీ పీసీ లుక్స్ నిజమైన మేరీకోమ్ లుక్ తో సరిపోలలేదు.

5. షాహీద్ భగత్ సింగ్ గా బాబీ డియోల్

బాబీ డియోల్ కాకుండా.. ఇతర స్టార్లు ప‌లువురు షాహీద్ భగత్ సింగ్ పాత్రను పోషించారు. అతను నిజ వ్యక్తిత్వాన్ని సరిపోల్చడంలో విఫలమయ్యాడు. అయితే అద్భుత న‌ట‌న‌తో క‌వ‌రింగ్ చేసేయ‌గ‌లిగాడు.

6. మాయ డోలస్ గా వివేక్ ఒబెరాయ్


వివేక్ ఒబెరాయ్ `షూటౌట్ ఎట్ లోఖండ్ వాలా` లో గ్యాంగ్ స్టర్ మాయ డోలాస్ గా అద్భుతమైన నటన క‌న‌బ‌రిచినా.. అతని లుక్స్ ఒరిజిల్ వ్య‌క్తితో సరిపోలలేదు. అతని హెయిర్ స్టైల్ నుండి డ్రెస్సింగ్ వరకు అసలు ఏదీ సరిపోలలేదు. అంతా సినిమాటిగ్గా మార్చేశారు.

7. హరిలాల్ గాంధీగా అక్షయ్ ఖన్నా

అక్షయ్ ఖన్నా రూపం మేకోవ‌ర్ గాంధీజీ బ‌యోపిక్ చిత్రంలో మహాత్మా గాంధీ కుమారుడైన‌ నిజమైన హిరాల్ గాంధీతో సరిపోలలేదు. ఇక‌ నటన గురించి మాట్లాడితే ఖ‌న్నా ఆకట్టుకునే ప్ర‌ద‌ర్శ‌నతో మెప్పించాడు.

8. షాహిద్ అజ్మీగా రాజ్ కుమార్ రావు

రాజ్ కుమార్ రావు న‌ట‌న గురించి చెప్పాల్సిందేమీ లేదు. న్యాయవాది షాహిద్ అజ్మీ పాత్ర పోషించినందుకు అత‌డు చాలా ప్రశంసలు అందుకున్నాడు. మేకోవర్ గురించి మాట్లాడితే అత‌డి లుక్ నిజమైన షాహిద్ అజ్మీతో సరిపోలలేదు.

9. మంగల్ పాండేగా అమీర్ ఖాన్

నిజజీవితం గురించి మాట్లాడేటప్పుడు అమరవీరుడు మంగల్ పాండే భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న‌వాడిగా కనిపిస్తాడు. అమీర్ ఖాన్ పాత్ర స్వ‌భావం స‌ద‌రు ప్ర‌ముఖుని నిజ‌ వ్యక్తిత్వంతో సరిపోలలేదు. పైగా ఈ చిత్రం ప‌రాయం పాల‌వ్వ‌డంతో పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

10. ఎన్టీఆర్ బ‌యోపిక్:

న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌమ ఎన్టీఆర్ పాత్ర‌లో ఆయ‌న వార‌సుడు బాల‌కృష్ణ న‌టిస్తే ఒక సెక్ష‌న్ ఆడియెన్ నుంచి పెద‌వి విరుపులు త‌ప్ప‌లేదు. నంద‌మూరి అభిమానులు బాల‌య్య లుక్ స‌రిపోయింద‌ని ప్ర‌శంసించినా.. మెజారిటీ ఆడియెన్ సంతృప్తి చెంద‌లేదు. జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే తార‌క్ కి మాత్ర‌మే తార‌క రాముని గెట‌ప్ సూట‌వుతుంద్న గుస‌గుస‌లాడ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఇక ఈ బ‌యోపిక్ క‌థ‌లో ఒరిజినాలిటీ లేక‌పోవడం అస‌లైన ఎపిసోడ్స్ తొల‌గించ‌డంతో ఆ ప్ర‌భావం బాక్సాఫీస్ పైనా ప‌డి డిజాస్ట‌ర్ గా నిలిచింది.

ఇలా ఎన్నో బ‌యోపిక్ ల విష‌యంలో ప్రూవైంది. వీటి తాలూకా హిస్ట‌రీని భావిత‌రాలు నిరంత‌రం చ‌ర్చించుకుంటాయి. మీడియాలోనూ వీటిపై ఇప్ప‌టికే ప‌లు ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.