Begin typing your search above and press return to search.
ఓటీటీలో వెంకీ 'నారప్ప' రిలీజ్ డేట్ ఫిక్స్..!
By: Tupaki Desk | 12 July 2021 11:35 AM GMTవిక్టరీ వెంకటేష్ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందించిన తాజా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ''నారప్ప''. ధనుష్ తమిళ బ్లాక్ బస్టర్ హిట్ 'అసురన్' చిత్రానికి ఇది అధికారిక తెలుగు రీమేక్. వి క్రియేషన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై కలైపులి ఎస్.థాను - సురేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదల చేస్తున్నారు.
'నారప్ప' చిత్రాన్ని జూలై 20న అమెజాన్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓల్డ్ మ్యాన్ గెటప్ లో ఉన్న వెంకటేష్ కు సంబంధించిన ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో బ్యాగ్రౌండ్ లో ఒక గ్రామంలోని ఇళ్ళు తగలబడటం కనిపిస్తోంది. సమాజంలోని కుల వ్యవస్థ గురించి ప్రస్తావించే ఈ చిత్రంలో వేర్వేరు షేడ్స్ ఉన్న పాత్రలో వెంకీ కనిపించనున్నారు. ఇందులో నారప్ప భార్య సుందరమ్మ పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి నటించింది.
ఇప్పటికే విడుదలైన 'నారప్ప' సినిమా టీజర్ మరియు ఇతర ప్రమోషనల్ కంటెంట్ మంచి ఆదరణ తెచ్చుకుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. ఇటీవలే 'చలాకీ చిన్నమ్మి' అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీక్ రత్నం - రావు రమేష్ - రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముందుగా థియేటర్స్ లోనే విడుదల చేయాలని నిర్ణయించినా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ రిలీజ్ ని స్కిప్ చేసి ఓటీటీ వేదికగా రిలీజ్ చేయడానికి మేకర్స్ నిర్ణయించారు.