Begin typing your search above and press return to search.
విరాటపర్వం రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ..!
By: Tupaki Desk | 14 May 2021 3:30 AM GMTటాలీవుడ్ ఇండస్ట్రీకి 'నీది నాది ఒకే కథ' అనే సినిమాతో దర్శకుడుగా అడుగుపెట్టాడు వేణు ఊడుగుల. ఫస్ట్ సినిమానే మంచి విజయం సాధించి విమర్శకుల నుండి ప్రశంసలు తీసుకొచ్చింది. ఇప్పుడు వేణు దర్శకత్వంలో సెకండ్ మూవీగా విరాటపర్వం రూపొందుతుంది. టాలీవుడ్ హీరో రానా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నాయకనాయికలుగా నటించిన ఈ సినిమా షూటింగ్ ముగించుకొని విడుదలకు సిద్ధమైంది. కానీ సరిగ్గా విడుదలకు కొద్దీ రోజులముందే కరోనా మహమ్మారి వ్యాప్తి చెండటంతో థియేటర్స్ బంద్ అయిపోయి సినిమా రిలీజ్ వాయిదా పడింది.
ఓకే వాయిదా పడింది త్వరలోనే మరో డేట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుందిలే అనుకునే లోపల విరాటపర్వం సినిమా డిజిటల్ రిలీజ్ కాబోతుందని పుకార్లు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇటీవలే హీరోయిన్ సాయిపల్లవి పుట్టినరోజు నుండి పుకార్లు మరింత జోరందుకున్నాయి. అందుకే తాజాగా విరాటపర్వం మేకర్స్ ఈ పుకార్లకు చెక్ పెట్టేసారు. విరాటపర్వం సినిమా ఖచ్చితంగా థియేట్రికల్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. విరాటపర్వం థియేట్రికల్ రైట్స్ తో పాటుగా డిజిటల్ రైట్స్ - తెలుగు సాటిలైట్ రైట్స్ - హిందీ డబ్బింగ్ రైట్స్ అన్నికూడా డిస్ట్రిబ్యూటర్ లకు అమ్ముడైనట్లు మేకర్స్ తెలిపారు.
కాబట్టి సినిమా థియేట్రికల్ రిలీజ్ అవుతుందని చెప్పారు. అయితే రిలీజ్ ముందే సినిమా హక్కులే లాభాలు తెచ్చిపెట్టినట్లు సమాచారం. విరాటపర్వం థియేట్రికల్ రైట్స్ వరంగల్ శ్రీను దక్కించుకున్నాడు. అలాగే సినిమా రిలీజ్ డేట్ కూడా కరోనా పరిస్థితి తొలగిపోయాక చెబుతామని తెలిపారు. ఈ సినిమా 1990 కాలంనాటి నక్సలైట్ల జీవితాల ఆధారంగా పీరియాడిక్ సోషల్ మూవీగా రూపొందింది. ఈ సినిమాలో ప్రియమణి, నివేత పేతురాజ్, నందిత దాస్ కీలకపాత్రలలో నటించారు. సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.