Begin typing your search above and press return to search.

'గ‌ని'పై మేక‌ర్స్ క్రేజీ ఎక్స్ పెక్టేష‌న్స్‌

By:  Tupaki Desk   |   31 March 2022 8:38 AM GMT
గ‌నిపై మేక‌ర్స్ క్రేజీ ఎక్స్ పెక్టేష‌న్స్‌
X
తెలుగు సినిమా అంటే ఇప్పుడు యావ‌త్ దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. ప్ర‌తీ సినిమాకు మార్కెట్ కూడా భారీగా జ‌రుగుతుండ‌టంతో మ‌న మేక‌ర్స్ త‌మ సినిమాల బిజినెస్, థియేట్రిక‌ల్ రైట్స్ ప‌రంగా భారీగానే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. వారి డిమాండ్ కి త‌గ్గ‌ట్టుగా థియేట్రిక‌ల్ రైట్స్ కి భారీ క్రేజ్ ఏర్ప‌డ‌టంతో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. డిమాండ్ ని బ‌ట్టి భారీ ఫిగ‌ర్ లు డిమాండ్ చేస్తున్నారు. నార్త్ లో నూ మ‌న సినిమాకు మంచి డిమాండ్ వుండ‌టంతో ప్ర‌తీ నిర్మాత త‌న సినిమాకు భారీగానే డిమాండ్ చేస్తుండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వ‌రుణ్ తేజ్ తాజా చిత్రానికి కూడా మేక‌ర్స్ థియేట్రిక‌ల్ రైట్స్ విష‌యంలో భారీగానే ఎక్స్‌పెక్ట్ చేస్తుండ‌టం ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించిన చిత్రం 'గ‌ని'. బాక్సింగ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్ బాక్స‌ర్ గా న‌టించారు. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే వున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ స‌యీ మంజ్రేక‌ర్ హీరోయ‌న్ గా న‌టించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, క‌న్న‌డ స్టార్ ఉపేంద్ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

దీంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని స్థాయిలో ఈ మూవీ థిమేట్రిక‌ల్ రైట్స్ కి భారీ డిమాండ్ ఏర్ప‌డింది. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ మూవీని అల్లు అర్వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో సిద్దూ ముద్ద‌, అల్లు బాబి సంయుక్తంగా నిర్మించారు.

ఇప్ప‌టికే రెండు మూడు ద‌ఫాలుగా రిలీజ్ వాయిదా ప‌డిన ఈ మూవీ ని ఏప్రిల్ 8న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ మొద‌లైంది.

నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలో ఈ చిత్రానికి 25 కోట్లు వ‌చ్చిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. శాటిలైట్‌, డిజిట‌ల్‌, డ‌బ్బింగ్ రైట్స్ ప‌రంగా ఈ భారీ మొత్తం మేక‌ర్స్ సొతం చేసుకున్నారు.

అయితే థియేట్రిక‌ల్ రైట్స్ ప‌రంగా ఈ మూవీపై భారీ క్రేజ్ నెల‌కొన‌డంతో 50 కోట్లకు అమ్మేయాల‌ని, అంత రావాల‌ని మేక‌ర్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నార‌ట‌. ఆ రేంజ్ లో ఈ మూవీ థియేట్రిక‌ల్ రైట్స్ బిజినెస్ జ‌రుగుతుందా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. సినిమాపై వున్న డామాండ్ కార‌ణంగా ఇది సాధ్య‌మ‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.