Begin typing your search above and press return to search.

'స‌లార్‌' స్టోరీపై మేక‌ర్స్ హింట్ ఇచ్చేశారా?

By:  Tupaki Desk   |   3 Sep 2022 8:30 AM GMT
స‌లార్‌ స్టోరీపై మేక‌ర్స్ హింట్ ఇచ్చేశారా?
X
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ న‌టించిన 'కేజీఎస్‌' సిరీస్ మూవీస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిలిచిన విష‌యం తెలిసిందే. పార్ట్ 1కి మించి పార్ట్ 2 వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నం సృష్టించ‌డ‌మే కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. కూ. 1250 కోట్ల మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో ప్ర‌శాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో తెర‌కెక్కిస్తున్న 'స‌లార్‌' ప్రాజెక్ట్ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. 'కేజీఎఫ్ 2' త‌రువాత యావ‌త్ దేశం మొత్తం 'స‌లార్‌' రిలీజ్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది.

ప్ర‌భాస్ ని మోస్ట్ వ‌య‌లెంట్ మెన్ పాత్ర‌లో ప్ర‌జెంట్ చేస్తున్న ఈ మూవీలో ప్ర‌భాస్ కు జోడీగా శృతిహాస‌న్ న‌టిస్తోంది. మ‌రో కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టిస్తున్నాడు. దాదాపు కేజీఎఫ్ టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేస్తున్న ఈ మూవీని మోస్ట్ వ‌యెలెంట్ మూవీగా తెర‌పైకి తీసుకొస్తున్నారు. జ‌గ్గూ భాయ్ జ‌గ‌ప‌తిబాబు, మ‌ధు స్వామి విల‌న్ లుగా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్ప‌టి వ‌ర‌కు యాభై శాతం పూర్త‌యిన‌ట్టుగా తెలిసింది.

అయితే ఇటీవ‌ల ఆగ‌స్టు 1 నుంచి టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్స్ స్వ‌చ్ఛందంగా షూటింగ్ ల బంద్‌ కు పిలుపునివ్వ‌డంతో గ‌త నెల రోజులుగా స్టార్ హీరోల షూటింగ్ లు నిర‌వధికంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి.

ఈ మ‌ధ్య‌నే తిరిగి ఒక్కో మూవీ షూటింగ్ ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో ప్ర‌భాస్ న‌టిస్తున్న హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న 'స‌లార్‌' షూటింగ్ ఈ ఆదివారం నుంచి తిర‌గి ప్రారంభం కాబోతోంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం సోష‌ల్ మీడియా వేదిక‌గా 'వైలెంట్‌' అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఫ‌స్ట్ లుక్ రిలీజ్ ద‌గ్గ‌రి నుంచి ఈ మూవీ ఏ రేంజ్ లో వుండ‌బోతోందో స్ప‌ష్టం చేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌భాస్ లుక్ ని రిలీజ్ చేసిన సంద‌ర్భంలో మోస్ట్ వైలెంట్ మెన్ అంటూ ప్ర‌చారం మొద‌లు పెట్టారు. తాజాగా ఇదే విష‌యాన్ని మ‌రో సారి స్ప‌ష్టం చేస్తూ వైలెంట్ అని ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అంటే సినిమా చాలా వైలెంట్ గా వుంటుంద‌ని స్ప‌ష్ట‌మౌతోంది.

'స‌లార్‌' మేక‌ర్స్ ప‌దే ప‌దే వైలెంట్ వైలెంట్ అంటూ క్లారిటీ ఇస్తుండ‌టంతో 'కేజీఎఫ్ 2'లోని డైలాగ్ ని గుర్తు చేస్తోంద‌ని కొంత మంది అనుమానాల్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ 'కేజీఎఫ్' వ‌ర‌ల్డ్ కీ 'స‌లార్‌'కి సంబంధం ఏదైనా వుంటుందా? .. లేక 'స‌లార్‌' ప్ర‌పంచం వేరుగా వుంటుందా? అనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఏది నిజం ఏది అబ‌ద్దం అన్న‌ది తెలియాలంటే 2023 సెప్టెంబ‌ర్ 28 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.