Begin typing your search above and press return to search.

కొత్త పద్దతిలో పుష్ప ఓటీటీ రైట్స్ ఇచ్చిన మేకర్స్‌.. అరుదైన రికార్డ్‌ నమోదు

By:  Tupaki Desk   |   6 Jan 2022 7:30 AM GMT
కొత్త పద్దతిలో పుష్ప ఓటీటీ రైట్స్ ఇచ్చిన మేకర్స్‌.. అరుదైన రికార్డ్‌ నమోదు
X
పుష్ప సినిమా 2021 ఇండియన్ బాక్సాఫీస్ బిగ్గెస్ట్‌ మూవీగా ఇప్పటికే నిలిచింది. 300 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న పుష్ప సినిమా ఉత్తరాదిన ఇంకా కూడా భారీగానే షేర్ ను రాబడుతూ రన్ అవుతుంది. తెలుగు రాష్ట్రాలు మరియు ఇతర సౌత్‌ రాష్ట్రాల్లో కూడా ఇంకా థియేటర్లలో పుష్ప ఉన్నాడు.

అయినా కూడా రేపటి నుండి అమెజాన్‌ లో పుష్ప స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నాడు. ఒక వైపు అమెజాన్ లో మరో వైపు థియేటర్‌ లో పుష్ప రన్ అవ్వబోతున్నాడు. అమెజాన్ లో రేపటి నుండి తెలుగు.. తమిళం.. కన్నడం మరియు మలయాళం వర్షన్ లను మాత్రమే స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. హిందీ డిజిటల్‌ రైట్స్ ను అమెజాన్ వారికి ఇవ్వలేదనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

సౌత్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌ ల పుష్ప ఓటీటీ రైట్స్ కు గాను అమెజాన్‌ వారు మైత్రి మూవీస్ వారికి ఏకంగా 22 కోట్ల రూపాయల మొత్తంను చెల్లించినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేవలం సౌత్‌ లాంగ్వేజ్‌ ల రైట్స్ కే అంత మొత్తం అంటే ఖచ్చితంగా భారీ మొత్తం.

ఇక హిందీ డబ్బింగ్ ఓటీటీ రైట్స్ ను కూడా అమ్మితే మరో 8 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. అదే నిజం అయితే మొత్తం ఓటీటీ ద్వారానే పుష్ప 30 కోట్ల రూపాయలను రాబట్టినట్లుగా అవుతుంది. అంత భారీ మొత్తంను థియేటర్ రిలీజ్ తర్వాత ఏ సౌత్‌ సినిమా కూడా రాబట్టలేదు. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్ కు ఓకే చెప్పినందుకు గాను అమెజాన్ ఇంత భారీ మొత్తంను ఆఫర్‌ చేసిందనే టాక్ వినిపిస్తుంది.

హిందీ రైట్స్ ను కూడా అమెజాన్ తీసుకుందా లేదంటే ఆ రైట్స్ ను మళ్లీ వేరే అమ్మే ఉద్దేశ్యం ఏమైనా మైత్రి మూవీస్ వారికి ఉందా అనేది చూడాలి. మొత్తానికి అయితే రేపటి నుండి సౌత్‌ ఇండియన్ లాంగ్వేజ్ ల్లో మాత్రమే పుష్ప రాజ్‌ సందడి చేయబోతున్నాడు. హిందీ వర్షన్ రావడానికి మరి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.

మైత్రి మూవీ మేకర్స్ చాలా తెలివిగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్మారంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప థియేట్రికల్‌ రన్‌ మరియు శాటిలైట్‌ రైట్స్ ఇతర రైట్స్ ద్వారా భారీ మొత్తం దక్కించుకున్న మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ ఓటీటీ రైట్స్ తో మరింతగా లాభం దక్కించుకున్నట్లయ్యింది.

అల్లు అర్జున్‌ క్రేజ్ కూడా ఈ సినిమా తో బాలీవుడ్‌ మరియు ఇతర భాషల్లో కూడా పెరిగింది. ఆయన మార్కెట్‌ ఇంతకు ముందు తో పోల్చితే చాలా పెరిగింది అనడంలో సందేహం లేదు. సుకుమార్‌ ఇదే జోరుతో పుష్ప 2 ను కూడా తెరకెక్కిస్తే ఆ సినిమా మరింతగా బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. పుష్ప 2 ను ఫిబ్రవరిలో మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.