Begin typing your search above and press return to search.
టాలీవుడ్ హాట్: గుణశేఖర్-బాలయ్యలకు సుప్రీం నోటీసులు..
By: Tupaki Desk | 29 Aug 2022 4:43 PM GMTటాలీవుడ్ హిస్టరీలో ఒకే సంవత్సరం.. వెండితెరకెక్కిన రెండుప్రతిష్టాత్మక చిత్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడం.. సంచలనంగా మారింది. ఈ రెండు కూడా చరిత్ర ఆధారిత చిత్రాలే కావడం.. అవికూడా తెలుగు నాట చరిత్ర సృష్టించిన మూవీలు కావడం.. మరింత ఆసక్తిగా మారింది.
దీంతో టాలీవుడ్ ఒక్కసారిగా హీటెక్కింది. ప్రభుత్వాల నుంచి వినోదపు పన్నును రాయితీగా పొందిన ఈ రెండు సినిమాలు కూడా దాని తాలూకు ఫలాలను ప్రేక్షకులకు పంచకపోవడంపై సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఆ రెండు సినిమాల నటులు, దర్శకులు, నిర్మాతలకు తాజాగా నోటీసులు జారీ చేసింది.
నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన హీరోగా నటించిన వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి పన్ను రాయితీ తీసుకొని టికెట్ రేటు తగ్గించలేదని సినీ వినియోగదారుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు హీరో బాలకృష్ణ, 'గౌతమిపుత్ర శాతకర్ణి' నిర్మాతలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సహా ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఇలా కూడా జరుగుతుందా? అని సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
మరోవైపు...గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం 'రుద్రమదేవి'కి కూడా నోటీసులు జారీ అయ్యాయి. రెండూ చారిత్రాత్మక చిత్రాలు కావడం వల్ల అప్పటి టీడీపీ ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది.
పన్ను రాయితీ ప్రయోజనాలను సినీ ప్రేక్షకులకు బదలాయించలేదని, రాయితీ పొందిన డబ్బు తిరిగి ప్రభుత్వం రికవరీ చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ధర్మాసనానికి వివరణ ఇవ్వాల్సిందిగా కథానాయకుడు బాలకృష్ణకు, దర్శకులకు, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.