Begin typing your search above and press return to search.

అదేం సినిమా ప్రమోషన్ బాబోయ్..!

By:  Tupaki Desk   |   20 Nov 2018 7:18 AM GMT
అదేం సినిమా ప్రమోషన్ బాబోయ్..!
X
ఒక సినిమా విజయంలో ప్రమోషన్స్ కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ఫిలింమేకర్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐడియాలతో మూవీ ప్రమోషన్స్ చేపడతారు. బాలీవుడ్ లో ఒక్కోసారి ఇవి చాలాదూరం వెళతాయి. హీరో - హీరోయిన్ ల ఎఫైర్ల గాసిప్పులు వదలడం లాంటి కూడా ఇందులో భాగమే. తాజాగా 'ది డార్క్ సైడ్ ఆఫ్ లైఫ్: ముంబై సిటీ' అనే సినిమాకోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్ అయింది.

ఇంతకీ వాళ్ళేం చేశారంటే.. ఈ సినిమా ముంబైలోని ఓషివారా సింగల్ వద్ద సినిమా పోస్టర్ పెద్దది పెట్టారు. దానికి ఒక మనిషిని ఉరిదీసి వేలాడదీశారు. దీన్ని చూసిన జనాలందరూ నిజంగా ఎవరో ఫసాక్ అని అనుకున్నారు. కానీ అది నిజం కాదని తాము బకరాలమయ్యమని లేటుగా తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ప్రమోషన్ కోసం ఓ బొమ్మ మనిషికి ఉరిదీసి అక్కడ తగిలించారట.

నవంబర్ 23 న రిలీజ్ కానున్న ఈ సినిమాలో ఏడుమంది నగరజీవుల కథలు ఉంటాయట. వాళ్ళ సమస్యలు.. ఆర్ధిక సమస్యలతో ముంబైలో బతకలేక.. చావలేక వారు ఎదుర్కొనే టెన్షన్ లాంటివి ఉంటాయట. సినిమాను ప్రమోట్ చేసేందుకు పెద్ద స్టార్లు లేకపోవడంతో ఇలాంటి ప్రచారంతో ప్రేక్షకుల దృష్టి తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారటట. మరీ ఇలాంటి ఐడియా మన రామ్ గోపాల్ వర్మ గారికి కూడా రాలేదే. ఏం ముంబయ్యో .. ఏం ప్రమోషన్లో.. !