Begin typing your search above and press return to search.

రోర్ ఆఫ్ RRR: ఇక స‌మ‌ర‌శంఖం పూరించిన‌ట్టే..!

By:  Tupaki Desk   |   11 July 2021 11:30 AM GMT
రోర్ ఆఫ్ RRR: ఇక స‌మ‌ర‌శంఖం పూరించిన‌ట్టే..!
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కథానాయకులుగా ద‌ర్శ‌కధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో RRR చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం యూనిట్ పాట‌ల చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉంది. ఇప్ప‌టికే టాకీ పూర్త‌యిన నేప‌థ్యంలో సాంగ్ షూట్ పూర్తి చేసిన త‌ర్వాత ప్యాచ్ వ‌ర్క్ కి వెళ్ల‌డానికి స‌న్నాహాకాలు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి ప్ర‌చారానికి తెరలేపారు. ఈనెల 15 ఉద‌యం 11 గంట‌ల‌కు మెగా-నంద‌మూరి అభిమానుల‌కు బిగ్ ట్రీట్ ప్లాన్ చేసారు. RRRకి చెందిన మేకింగ్ వీడియోలను రిలీజ్ చేయ‌నున్నారు. `రోర్ ఆఫ్ RRR` పేరుతో ఈ వీడియోల్ని అభిమానుల్లోకి వ‌ద‌ల‌బోతున్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగా యూనిట్ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించింది.

తార‌క్ చ‌ర‌ణ్ ల‌కు తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానులున్నారు. దీంతో మేకింగ్ వీడియోలు వైర‌ల్ గా దూసుకెళ్ల‌డం ఖాయం. పాన్ ఇండియా ఫీవ‌ర్ ని రాజేసేందుకు ఈ వీడియోలు గొప్పగా స‌హ‌క‌రించ‌నున్నాయని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. గ‌తంలో ఇలాంటి స్ట్రాట‌జీనే ఎలాంటి అంచ‌నాలు లేని బాహుబ‌లిపై ప్ర‌యోగించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా ఇద్ద‌రు అగ్ర హీరోల‌తోనే బ‌రిలోకి దిగుతున్నారు కాబ‌ట్టి రీచబిలిటీ భారీ స్థాయిలో ఉండ‌నుంది. మేకింగ్ వీడియోల‌తో మొద‌లు పెట్టే ప్ర‌మోష‌న్ మ‌రో లెవ‌ల్ కి చేర్చేందుకు జక్క‌న్న టీమ్ స‌రైన ప్ర‌ణాళిక‌తో ఉంద‌ని తెలుస్తోంది.

అటు బాలీవుడ్ నుంచి అజ‌య్ దేవ‌గ‌న్ .. ఆలియా భ‌ట్ లాంటి స్టార్ల అండ‌దండ‌లు ఆర్.ఆర్.ఆర్ కి ఉన్నాయి కాబ‌ట్టి హిందీ బెల్ట్ లో ప్ర‌మోష‌న్ కి ఎలాంటి స‌మ‌స్యా ఉండ‌క‌పోవ‌చ్చని భావిస్తున్నారు.