Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ కాల్ కోసం వేచి చూస్తున్న మేకర్స్..!
By: Tupaki Desk | 20 Jan 2022 5:38 AM GMTపవన్ కళ్యాణ్ కమిటైన నాలుగు చిత్రాల్లో రెండు సెట్స్ మీద ఉండగా.. మరో రెండు సినిమాల షూటింగులను ప్రారంభించాల్సి ఉంది. అందులో 'భీమ్లా నాయక్' చిత్రాన్ని ఫిబ్రవరి 25వ తేదీన.. 'హరి హర వీరమల్లు' సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే షెడ్యూల్ ప్రకారం పవన్ చిత్రాలు విడుదల కావడం కష్టమే అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రానా దగ్గుబాటితో కలిసి పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ''భీమ్లా నాయక్''. ఒక సాంగ్ మరియు చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. అయితే తిరిగి సెట్స్ మీదకు వచ్చి వీలైనంత త్వరగా బ్యాలన్స్ షూట్ పూర్తి చేస్తారని భావిస్తుండగా.. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటం మేకర్స్ ను కలవర పెడుతోంది.
ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి లాక్ డౌన్స్ లేవు. సినిమా షూటింగ్ ల మీద ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల రేటు ఎక్కువగా ఉండటం.. థర్డ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఇంకొన్నాళ్ళు సెట్స్ లో తిరిగి అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నారట.
ఇదే నిజమైతే 'భీమ్లా నాయక్' విడుదల లేట్ అవడమే కాదు.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'వీరమల్లు' మూవీ షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు హరీష్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా స్టార్ట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు. 'భీమ్లా నాయక్' పెండింగ్ పోర్షన్ షూటింగ్ ను పవన్ పూర్తి చేస్తే.. సమ్మర్ రిలీజ్ ని టార్గెట్ గా పెట్టుకోవచ్చని మేకర్స్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.