Begin typing your search above and press return to search.

ఆ హాటీ.. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ

By:  Tupaki Desk   |   10 Nov 2016 11:25 AM GMT
ఆ హాటీ.. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ
X
మనసులో ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలుకొట్టినట్లు చెప్పే కుర్ర బ్యూటీ ఆలియా భట్. తనకు గానీ ఉడ్తాపంజాబ్ మూవీకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఇవ్వకపోతే ఫీలయిపోతానని ఓపెన్ గానే చెప్పేయగల ధైర్యం చాలా తక్కువమందికి ఉంటుంది. అలాంటి ఆలియా.. ప్రతీ సినిమాలోనూ కొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. గ్లామర్ రోల్స్ నుంచి ఉడ్తా పంజాబ్ లాంటి పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ వరకూ అన్నిటినీ మెప్పించేసే.. ఈ యంగ్ గాళ్ ఇప్పుడు డియర్ జిందగీ చిత్రంలో షారూక్ ఖాన్ తో జోడీ కట్టింది.

ఈ మూవీలో ఆలియా భట్ పాత్ర 'డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ'. ఇలాంటి రోల్ సినిమాల్లో కనిపించడమే కొత్త అయితే.. ఆ పాత్రను హీరోయిన్ తో చేయించడం మరింతగా చెప్పుకోవాల్సిన విషయం. మేకింగ్ ఆఫ్ ఆలియా యాజ్ డీఓపీ అంటూ ఓ మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశారు. ఇందులో కెమేరాఉమన్ గా యాక్టింగ్ చేసేందుకు తాను ఫేస్ చేసిన పరిస్థితులు.. కష్టాలు.. చెయ్యి ఎంతగా నొప్పి పెట్టిందో అనే సంగతులు.. వ్యూ ఫైండర్ లోంచి చూసి మూవీ ఔట్ పుట్ గురించి ముందుగానే ఊహించడం లాంటి విషయాలు ఎన్నో వివరించింది ఆలియా భట్.

షారూక్ తన స్వంత బ్యానర్ పైనే ఓ పార్ట్నర్ గా నిర్మిస్తున్న డియర్ జిందగీ.. నవంబర్ 25న థియేటర్లలోకి వచ్చేయనుంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/