Begin typing your search above and press return to search.

`బ్ర‌హ్మాస్త్ర` మేకింగ్ : ఇది ప్ర‌యోగ‌మా? సాహ‌స‌మా?

By:  Tupaki Desk   |   6 Sep 2022 2:30 AM GMT
`బ్ర‌హ్మాస్త్ర` మేకింగ్ : ఇది ప్ర‌యోగ‌మా? సాహ‌స‌మా?
X
కొన్ని సినిమాల్ని చూడ‌గానే ఇది కేవ‌లం ప్ర‌యోగం కోస‌మా? లేక ప్ర‌జ‌ల ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టు చేసిన ప్ర‌య‌త్న‌మా? అన్న‌ది ముందుగా అర్థం కాదు. అంజి- ఢ‌మ‌రుకం లాంటి సినిమాలు విడుద‌లైన‌ప్పుడు తెలుగు ఆడియెన్ త్వ‌ర‌గా డైజెస్ట్ చేసుకోలేక‌పోయారు. ద‌ర్శ‌కులు ఎంతో ఇమాజినేట్ చేసుకుని ఎంతో గొప్ప‌గా విజువ‌ల్ గ్రాఫిక్స్ తో భారీ క‌థ‌తో తెర‌కెక్కించేందుకు చాలా సాహ‌సాలే చేసారు. కానీ థియేట‌ర్ల‌లో ఆశించిన‌ది ద‌క్క‌లేదు.

అయితే ఢ‌మ‌రుకం చిత్రానికి నాగార్జున స్టార్ ప‌వ‌ర్ పెద్ద అస్సెట్ అయ్యింది. నాగ్ న‌ట‌న వ‌ల్ల క‌లెక్ష‌న్ల ప‌రంగా చాలా వ‌ర‌కూ సేఫ్ అయ్యింది. ఇక‌పోతే ఇటీవ‌లి కాలంలో బ్ర‌హ్మాస్త్ర గురించి ఇదే త‌ర‌హాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ద‌ర్శ‌కుడు ఆయాన్ ముఖ‌ర్జీతో క‌లిసి క‌ర‌ణ్ జోహార్ ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కించ‌గా ర‌ణ‌బీర్ - ఆలియా భ‌ట్ త‌మ కెరీర్ ట‌ర్నింగ్ మూవీ కోసం ఎంత‌గానో త‌పించి ప‌ని చేసారు.

భారీ విజువ‌ల్ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ తో ఈ మూవీని అవెంజ‌ర్స్ కి ఇండియా వెర్ష‌న్ త‌ర‌హాలో రూపొందించారు. మాన‌వులే దేవుళ్లు త‌ర‌హాలో పాత్ర‌ల‌తో భారీ ప్ర‌యోగం చేసారు. శివుడి నేప‌థ్యం కావ‌డంతో భ‌క్తుల్లో ఆస‌క్తిని పెంచ‌గ‌లిగారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ స‌హా ప్ర‌తిదీ వైర‌ల్ అయ్యాయి.

కానీ ఇవ‌న్నీ జ‌నాల్ని థియేట‌ర్ల‌కు రప్పించ‌గ‌ల‌వా లేదా? అన్న‌ది తేలాల్సి ఉంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా కేట‌గిరీలో అన్ని న‌గ‌రాల్లోనూ ప్ర‌మోట్ చేస్తుండ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచింది. రాజ‌మౌళి అంత‌టి వారే ఈ మూవీకి స‌మ‌ర్ప‌కులుగా చేరి బోలెడంత ప్ర‌చారం చేస్తున్నారు. మూవీపై పొగ‌డ్త‌లు కురిపిస్తున్నారు. తాజాగా `బ్ర‌హ్మాస్త్ర‌` మేకింగ్ వీడియోని విడుద‌ల చేయ‌గా ఇది వైర‌ల్ గా దూసుకెళుతోంది. ఈ మూవీ కోసం ఆయాన్ ముఖ‌ర్జీ ఎంతో నిజాయితీగా హార్డ్ వ‌ర్క్ చేశార‌ని అర్థ‌మ‌వుతోంది.

ఆలియా- ర‌ణ‌బీర్ క‌పూర్ ల‌తో భారీ యాక్ష‌న్ విన్యాసాల‌ను తెర‌కెక్కించేందుకు గొప్ప సాంకేతిక‌త‌ను ఉపయోగించారు. బ్లూమ్యాట్ గ్రీన్ మ్యాట్ త‌ర‌హా చిత్రీక‌ర‌ణ కోసం చాలా సెట్టింగులు వేసారు. ఇది అంత సులువైన ప్ర‌య‌త్నం అయితే కాదు. అందుకు త‌గ్గ‌ట్టే విజువ‌ల్ మాయాజాలంతో పాటు ఎమోష‌న‌ల్ కంటెంట్ తో ఆక‌ట్టుకుంటే సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంటేనే బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడుతుంది. ముఖ్యంగా ఉత్త‌రాదిన ర‌ణ‌బీర్ - ఆలియా స్టార్ ప‌వ‌ర్ వ‌ర్క‌వుటైనా కానీ ద‌క్షిణాది ఆడియెన్ ని మెప్పించాలంటే క‌నెక్టివిటీ చాలా హై లెవ‌ల్లో ఉండాలి. సెప్టెంబ‌ర్ 9న ఈ చిత్రం తెలుగు-త‌మిళం-మ‌ల‌యాళం-క‌న్న‌డ స‌హా హిందీలో అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది.

అది మ‌హదాద్భుతం.. ఇది ఒక క‌లలాగా ... క‌ల‌నే నిజం చేశారా? అనిపిస్తోంది. భార‌త‌దేశంలోనే ఈ త‌ర‌హా ఇదే మొద‌టి ఫిలిం. న‌మ్మ‌కాలు దైవ‌త్వం.. ప్ర‌పంచ‌పు అత్యంత పురాత‌న‌మైన వినాశ‌క‌ర బ్ర‌హ్మాస్త్రం గురించి సినిమా తీసే ప్ర‌య‌త్నం అసాధార‌ణం..! అంటూ పొగిడేస్తూ ఈ వీడియోని ద‌ర్శ‌కుడు అయాన్ స్వ‌యంగా షేర్ చేసారు. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా దూసుకెళుతోంది. ఈ బ్ర‌హ్మాస్త్రం ప్ర‌పంచ‌ వినాశ‌నాన్ని కాదు... జ‌నాల పాకెట్ ల‌ను ఖాళీ చేయిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద కాసులు కురిపించాల్సి ఉంటుంది. ఇది ప్ర‌యోగమా ? సాహ‌స‌మా ? తేలే బిగ్ డే సెప్టెంబ‌ర్ 9. ఆ రోజుకోస‌మే ప్ర‌జ‌లంతా వెయిటింగ్.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.