Begin typing your search above and press return to search.
కాటమరాయుడు ఒక మ్యూజికల్ సినిమానా?
By: Tupaki Desk | 7 March 2017 3:41 PM GMTఅసలు కాటమరాయుడు పోస్టర్లను చూస్తే మనకు ఏం అనిపిస్తుంది? అలాగే సినిమా టీజర్లో గొడుగు నీడ సాక్షిగా పవన్ కళ్యాణ్ కళ్ళను క్లోజ్ అప్ లో చూస్తుంటే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? ఇదో ఊర మాస్ సినిమా.. అభిమానులకు కావల్సిన ఫుల్ మీల్స్.. ఇలాంటి ఫీలింగ్సేగా వస్తాయ్. కాని ఈ సినిమా కూడా మరో ఖుషీ.. మరో అత్తారింటికి దారేది.. మరో సర్దార్.. అని చెబితే ఎలా ఉంటుందంటారూ?
నిజానికి పవర్ స్టార్ రాయుడుగా వస్తున్నాడంటే మాస్ సినిమా అనుకుంటాం కాని.. ఇదొక మ్యూజికల్ సినిమా అంటున్నాడు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. ఈ సినిమాలో కేవలం ఆరు పాటలే కాకుండా.. సినిమాలో మరో మూడు బిట్ సాంగ్స్ కూడా ఉన్నాయట. సినిమా అంతటా మ్యూజిక్ ఎప్పటికప్పుడు డామినేట్ చేస్తే.. ఇదొక మ్యూజికల్ మూవీ మ్యాజిక్ అనే ఫీలింగ్ కలిగిస్తుందట. మిరా మిరా మీసం పాట హిట్టయినందుకు పీకె అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన అనూప్.. ఇప్పుడు సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అవ్వడం గ్యారంటీ అంటున్నాడు.
ఇక అనూప్ చెప్పిన దాంట్లో కూడా నిజముంది. ఆ లెక్కన చూస్తే పవన్ ఖుషీ అయినా.. మొన్న వచ్చిన సర్దార్ అయినా కూడా మ్యూజికల్ గా పెద్ద పెద్ద హిట్లే అయ్యాయ్. అంటే పవన్ సినిమాలన్నీ మ్యూజికల్ మ్యాజిక్కులేగా మరి. అందుకే దీన్ని కూడా మ్యూజికల్ మూవీ అనేసుంటాడు.