Begin typing your search above and press return to search.
రోర్ ఆఫ్ 'వీరసింహారెడ్డి' వచ్చేసింది!
By: Tupaki Desk | 31 Dec 2022 8:30 AM GMTనందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఫ్యాక్షన్ ఎంటర్ టైనర్ 'వీర సింహారెడ్డి'. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ ఫ్యాక్షన్ డ్రామాని 2023 సంక్రాంతి కి జనవరి 12న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. బాలయ్య డ్యుయెల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్, ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కి సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రయోషన్స్ జోరు పెంచేసింది.
ఈ సందర్భంగా లిరికల్ వీడియోలతో హోరెత్తిస్తున్న మేకర్స్ తాజాగా శనివారం 'రోర్ ఆఫ్ వీర సింహారెడ్డి' పేరుతో మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. సినిమాలోకి కీలక ఘట్టాల చిత్రీకరణ ఏ విధంగా జరిగిందో ఈ వీడియోలో అభిమానులతో పంచుకున్నారు.
క్లైమాక్స్ కి సంబంధించిన పోరాట ఘట్టాలని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన తీరు అభిమానులకు రోమాంచిత అనుభూతిని కలిగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక కీలక ఘట్టాల చిత్రీకరణ కోసం భారీ సెట్ లని నిర్మించారు.
కల్యాణ మండపం సీన్ లో బాలయ్య విలన్ లకు వార్నింగ్ ఇస్తున్న తీరు, ఈ సీన్ కు తమన్ అందించిన బీజీఎమ్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా వుంది. ఈ మూవీకి సంబంధించిన కీలక సెట్ లో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ, కుమార్తెలు బ్రాహ్మిణి, తేజస్విని సందడి చేశారు. బాలయ్యపై చిత్రీకరించిన పలు కీలక ఘట్టాల్లో వరలలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజ్ కూడా పాల్గొంది. అయితే ఈ ఇద్దరూ ఓల్డ్ గెటప్ లలో కనిపించడం గమనార్హం.
బాలకృష్ణకు వీరాభిమాని అయిన గోపీచంద్ మలినేని ఈ మూవీని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించినట్టుగా మేకింగ్ వీడియోతో స్పష్టమవుతోంది. రిషీ పంజాబీ ఛాయాగ్రహణం అందించిన ఈ మూవీలోని ప్రతీ ఫ్రేమ్ భారీ తనంతో నిండిపోయి కనిపించిన తీరు, తండ్రిగా, తనయుడిగా బాలయ్య నటించిన తీరు సినిమాకు ప్రధాన హైలైట్ గా మారనుంది. ఓల్డ్ గెటప్ లో బాలయ్య సుట్ట ని ఎగరేస్తూ రజనీ ని తలపించిన తీరు థియేటర్లలో పూనకాలు తెప్పించనుంది.
ఇదిలా వుంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకని జనవరి 6న ఒంగోలులో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఇదే వేదిక సాక్షిగా 'వీర సింహారెడ్డి' ట్రైలర్ ని కూడా విడుదల చేయబోతున్నారు. సాయి మాధవ్ బుర్రా పవర్ ఫుల్ డైలాగ్స్ అందించిన ఈ మూవీకి రిషీ పంజాబీ ఫొటోగ్రఫీ, తమన్ సంగీతం, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ అందిస్తున్నారు. దునియా విజయ్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, షఫీ, హనీ రోజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.