Begin typing your search above and press return to search.

బాహుబలి మాయకు మకుటం!!

By:  Tupaki Desk   |   14 April 2017 4:49 AM GMT
బాహుబలి మాయకు మకుటం!!
X
మకుట.. ఈ పేరు గతంలో ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ.. బాహుబలి పుణ్యమా అని ఆ సినిమాకి గ్రాఫిక్స్ అందించిన కంపెనీగా.. మకుటకు బోలెడంత గుర్తింపు దక్కింది. మరో రెండు వారాల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని.. ఇప్పటికీ ఇంకా అహోరాత్రులు కష్టపడుతూనే ఉన్నారు మకుట టీం.

ప్రతీ సింగిల్ షాట్ ఛాలెంజింగ్ గా ఉటుందని అంటున్నాడు విజువల్ ఎఫెక్ట్స్ హెడ్ డ్రాపర్. ఒక వేళ ఆర్ట్ ఈజీ అయితే.. అందరూ చేసేస్తారు కదా అన్న ఈయన.. లైవ్ యాక్షన్ సీన్స్ ను.. కంప్యూటర్ గ్రాఫిక్స్ తో మిక్సింగ్ చేయడంలో తన టీంతో కలిసి తెగ బిజీగా ఉన్నాడు. ప్రతీ రోజు పని ఫినిష్ చేసేసరికి ఉదయం 4 గంటలు అవుతోదంట. అది కూడా బాహుబలి దిం కంక్లూజన్ కు సంబంధించిన వర్క్ ను.. ప్రపంచవ్యాప్తంగా 35 స్టూడియోలకు పంచిన తర్వాత అనేది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ప్రస్తుతం మకుటలోనే 80 మంది గ్రాఫిక్ డిజైనర్స్.. ఇదే పనిలో పూర్తిగా నిమగ్నమైపోయి.. రాజమౌళి కలను సాకారం చేయడంలో బిజీగా ఉన్నారు.

బెన్ హర్.. టెన్ కమాండ్ మెంట్స్ లాంటి చిత్రాలు చూసి పెరిగిన జక్కన్న.. ఇప్పుడు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్.. ట్రాన్స్ ఫార్మర్స్ లాంటి మూవీస్ చూస్తున్న ఆడియన్స్ ను గ్రాఫిక్స్ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నించడంలోనే సాహసం ఉంది. అయితే.. ఎన్ని ఇంగ్లీష్ సినిమాలు చూసినా.. మన బ్లడ్ లోను.. డీఎన్ ఏలోను ఉన్న అనేక అంశాలు.. ఇండియన్ స్టైల్ స్టోరీస్ ను చూసేందుకు ప్రేరేపిస్తాయన్న రాజమౌళి నమ్మకానికి నిలువెత్తు రూపమే బాహుబలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/