Begin typing your search above and press return to search.

మాజీలు.. కలసి భోజనాలు

By:  Tupaki Desk   |   31 Oct 2017 4:32 AM GMT
మాజీలు.. కలసి భోజనాలు
X
కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి ఉండకపోయినా సంతోషం కోల్పోవాల్సిన అవసరం లేదని బాలీవుడ్ సెలబ్రిటీ జంటలు నిరూపిస్తున్నాయి. ఎవరికి వారయినా అయినవాళ్లం కాకుండా పోమంటూ ఫ్యామిలీ రిలేషన్ కొత్త నిర్వచనం చెబుతున్నాయి.

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన చిన్ననాటి స్నేహితురాలు సుజానే ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ ఇద్దరు మగ పిల్లలు. తర్వాత ఇద్దరి భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయారు. భార్య నుంచి విడిపోయినా వాళ్ల బాగోగులు చూసుకుంటూ వారికి సన్నిహితంగానే ఉంటున్నాడు. పిల్లలతో పాటు తన మాజీ భార్యను తీసుకుని సెలవుల్లో సినిమాలు.. షికార్లకు వెళ్తూ మంచి తండ్రిగా పేరు తెచ్చుకున్నాడు. ఈమధ్య కొడుకులు హ్రీదాన్ - హ్రీహాన్ తో పాటు భార్య సుజానాను తీసుకుని సినిమాకు తీసుకెళ్లి వాళ్లతో రోజంతా ఖుషీగా గడిపాడు.

మరోవైపు సల్మాన్ సోదరుడు ఆర్బాజ్ ఖాన్ కూడా ఐటం సాంగ్ స్పెషలిస్ట్ మలైకా అరోరాను వివాహం చేసుకున్నాడు. కొడుకు పుట్టాక వీళ్లిద్దరూ విడిపోయారు. తాజాగా ఆర్బాజ్ కూడా భార్య కొడుకుతోపాటు మరదలు అమృత అరోరాను తీసుకుని రెస్టారెంట్ లో చక్కగా లంచ్ చేసొచ్చాడు.

భార్యాభర్తలు మధ్య మనస్పర్ధలనేవి సహజంగానే వస్తుంటాయి. సర్దుకు పోగలిగే పరిస్థితులు ఉన్నప్పుడు కలిసి ఉంటారు. అలా కానప్పుడు విడాకులు తీసుకుని ఎవరి బతుకు వాళ్లు బతుకుతారు. అంతమాత్రాన లైఫ్ లాంగ్ బద్ధ శత్రువుల్లా ఉండాల్సిన అవసరం లేకుండా మాంచి ఫ్రెండ్స్ లా కూడా ఉండొచ్చని ఈ బాలీవుడ్ కపుల్స్ నిరూపిస్తున్నారు.