Begin typing your search above and press return to search.

ప్రేమ గువ్వ‌లు మాల్దీవుల‌కు జంప్?

By:  Tupaki Desk   |   1 April 2019 7:08 AM GMT
ప్రేమ గువ్వ‌లు మాల్దీవుల‌కు జంప్?
X
కెవ్వు కేక అంటూ `గ‌బ్బ‌ర్ సింగ్` ఐటెమ్ గాళ్ గా తెలుగు యూత్ కి ట్రీటిచ్చిన మ‌లైకా అరోరాఖాన్ ఆ త‌ర్వాత పూర్తిగా ఫేడ‌వుట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఐటెమ్ నంబ‌ర్ల ప‌రంగా బాలీవుడ్ లో అడ‌పాద‌డ‌పా క‌నిపిస్తున్నా న‌టిగా మాత్రం అవ‌కాశాల్లేవ్. ప్ర‌స్తుతం యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో ఎఫైర్ సాగిస్తూ నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తోంది. ఇక ముంబై స‌హా దేశ విదేశాల్లో జ‌రిగే ఫ్యాష‌న్ ఈవెంట్ల‌లో మ‌లైకా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది.

ర్యాంప్ షోలు ఓవైపు.. ఒంట‌రి దీవుల‌కు షికార్లు ఇంకోవైపు మ‌లైకా నిత్య‌కృత్యాలు. ముంబై ఫేజ్ 3 ప్ర‌పంచంలో హాట్ మ‌మ్మీస్ అంతా ఓ గ్రూపుగా ఏర్ప‌డి విదేశీ షికార్లు, చిలౌట్ల‌తో వేడెక్కిస్తుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ బ్యాచ్ మాల్దీవుల‌కు వెళ్లారు. అక్క‌డ ఫుల్లుగా ఎంజాయ్ చేసి తిరిగి ముంబైకి వ‌చ్చారు. అయితే ఆ టూర్ పై ర‌క‌ర‌కాల సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా మ‌లైకా ఎక్క‌డ ఉంటే అక్క‌డ వాలిపోయే అర్జున్ ఈసారి వెళ్ల‌లేదా? అంటూ మాట్లాడుకుంటున్నారంతా. గ‌త ఏడాది ఇదే సీజ‌న్ ఇదే త‌ర‌హా ట్రిప్ లో అర్జున్ స‌డెన్ గా ప్ర‌త్య‌క్ష‌మై బిగ్ షాక్ ఇచ్చాడు. అదే తీరుగా ఈసారి కూడా వెళ్లాడా? అంటూ ముచ్చ‌టా సాగుతోంది.

తాజాగా మాల్దీవుల్లో చిలౌట్ చేసిన ఫోటోల్ని మ‌లైకా అరోరాఖాన్ సామాజిక మాధ్య‌మాల ద్వారా అభిమానుల‌కు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో స్విమ్ సూట్ ధ‌రించి అగ్గి రాజేసింది. స్విమ్మింగ్ పూల్ లో మ‌లైకా విన్యాసాల‌కు సంబంధించిన ఫోటోలు వేడెక్కిస్తున్నాయి. ఆ క్ర‌మంలోనే యూత్ కి ఓ ధ‌ర్మ‌ సందేహం వ‌చ్చింది. మ‌లైకాతో ఒంట‌రి దీవుల విహారంలో యంగ్ హీరో అర్జున్ క‌పూర్ కూడా ఉన్నాడా లేడా? అక్క‌డ సీక్రెట్ మీటింగ్ ఏదైనా ప్లాన్ చేయ‌లేదా? అంటూ ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. గ‌త కొంత‌కాలంగా మ‌లైకా- అర్జున్ జంట పెళ్లి వార్త‌లు వేడెక్కిస్తున్నాయి. ఈ ఏప్రిల్ లోనే పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నార‌ని, గుట్టు చ‌ప్పుడు కాకుండా ప్ర‌యివేటుగా ఈ వ్య‌వ‌హారాన్ని పూర్తి చేస్తార‌ని ప్ర‌ముఖ మీడియాల్లో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే దేనినీ ఈ జోడీ అధికారికంగా ధృవీక‌రించ‌లేదు. మ‌లైకా సైతం ఇలా ఫోటోషూట్ల‌ను రివీల్ చేయ‌డం మిన‌హా అర్జున్ తో త‌న పెళ్లి వ్య‌వ‌హారంపై పెద‌వి విప్ప‌డం లేదు. ఇక మొన్న మాల్దీవుల విహారంలోనే ఈ జంట పెళ్లికి సంబంధించి ఇంకేదైనా ప్లాన్ చేశారా? అన్న సందేహాల్ని తాజాగా అభిమానులు వ్య‌క్తం చేస్తున్నారు.