Begin typing your search above and press return to search.

మ‌లైకా అరోరా-అర్జున్ క‌పూర్ బ్రేక‌ప్

By:  Tupaki Desk   |   12 Jan 2022 6:30 PM GMT
మ‌లైకా అరోరా-అర్జున్ క‌పూర్ బ్రేక‌ప్
X
బాలీవుడ్ న‌టుడు అర్జున్ క‌పూర్ - మ‌లైకా ఆరోరా మూడేళ్లుగా సీరియ‌స్ డేటింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్యత్యాసం 12 ఏళ్లు ఉన్నా.. ఒక‌రంటే ఒకరికి విడిచి ఉండ‌లేనంత ప్రేమ‌. ఆ ప్రేమ ఎన్నో విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. కొడుకు వ‌య‌సు యువ‌కునితో ప్రేమాయ‌ణం ఏమిటో అంటూ మ‌లైకాపై సూటి పోటి మాట‌లు తెలిసిన‌వే. అయినా `వియ్ డోంట్ కేర్` అంటూ ఆ జంట ప‌బ్లిక్ గానే చెల‌రేగిపోయిన సంద‌ర్భాలు కోకొల్ల‌లు. ప‌బ్లిక్ గా హ‌గ్గులు..పెద‌వి ముద్దుల టెంప్టేష‌న్ లు ఓ రేంజ్ లో నెట్టింట వైర‌ల్ అయ్యారు. త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకుంటున్న‌ట్లు ప్రచారంలోకి వ‌చ్చింది. అయితే ఒకానొక స‌మ‌యంలో ఈ జంట విడిపోతున్నారని ప్ర‌చారం సాగింది.

ఆ ప్రచారాన్ని మాల్దీవుల వేకేష‌న్ తో తిప్పి కొట్టారు. ఇటీవ‌లే మాల్దీవుల్లో ఈ జంట ఎంజాయ్ చేస్తోన్న ఫోటోల్ని లీక్ చేసి మేము హ్యాపీగానే ఉన్నామంటూ చెప్పేసారు. అయితే తాజాగా ఈ జంట మ‌ధ్య పొర‌పొచ్చాలు తెల్లిన‌ట్లు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజులుగా ఇద్ద‌రు దూరంగా ఉంటున్నార‌ని.. ఎలాంటి ఫోన్ కాంటాక్ట్ కానీ లేకుండా ఎవ‌రి ప‌నుల్లో వాళ్లు బిజీ అయ్యార‌ని మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. ఇటీవ‌లే అర్జున్ క‌పూర్ -రియాక‌పూర్ ఇంటికి వెళ్లాడు. ఆ ప‌క్క‌నే మ‌లైకా ఆరోరా ఇల్లు కూడా ఉంది. అయితే ఆ స‌మ‌యంలో మ‌లైకా ఇంటికి వెళ్ల‌కుండా నేరుగా రియా క‌పూర్ ని క‌లిసి వ‌చ్చేసాడు.

దీంతో బ్రేక‌ప్ నిజ‌మేన‌ని మ‌రింత బ‌ల‌ప‌డుతోంది. ఎప్పుడూ అర్జున్ క‌పూర్ వెంట ఉండే మ‌లైకా లేక‌పోవ‌డం.. ప్రియురాలి ఇంటికి వెళ్ల‌క‌పోవ‌డం వంటి స‌న్నివేశాలు ప‌రిశీలిస్తే ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నివేశం వేడెక్కిన‌ట్లే క‌నిపిస్తోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. దాదాపు ఇద్ద‌రి మ‌ధ్య బంధం తెగిపోయింద‌నే ప్ర‌చారం పీక్స్ లో జ‌రుగుతోంది. అదే నిజ‌మైతే ఆ జంట‌ను ఆడిపోసుకున్న వాళ్ల క‌ళ్లు చ‌ల్ల‌బ‌డిన‌ట్లే.