Begin typing your search above and press return to search.

అక్రమ సంబంధం అఫిషియల్‌ కానుంది

By:  Tupaki Desk   |   27 March 2019 11:04 AM GMT
అక్రమ సంబంధం అఫిషియల్‌ కానుంది
X
బాలీవుడ్‌ సెలబ్రెటీలు రెండవ పెళ్లిలు చేసుకోవడం - విడాకులు తీసుకోవడం - లివింగ్‌ రిలేషన్‌ షిప్‌ లో ఉండటం అనేది చాలా కామన్‌. అయితే మలైకా అరోరా మరియు అర్జున్‌ కపూర్‌ ల వ్యవహారం చాలా విభిన్నం. మలైకా అరోరా తన భర్త అర్బాజ్ ఖాన్‌ తో కలిసి ఉన్నప్పటి నుండి కూడా అర్జున్‌ కపూర్‌ తో ప్రేమ వ్యవహారం నడిపిందని - అర్జున్‌ కపూర్‌ తో ప్రేమ వ్యవహారం కారణంగానే అర్బాజ్ ఖాన్‌ కు దూరం అయ్యిందని వార్తలు వచ్చాయి. అర్బాజ్ ఖాన్‌ నుండి విడిపోయిన తర్వాత తనకు స్వేచ్చ దొరిందని, తన జీవితంను ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మల్చుకునేందుకు ఇప్పుడు నాకు స్వేచ్చ ఉందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మలైకా అరోరా చెప్పుకొచ్చింది.

చాలా ఏళ్లుగా వీరి ప్రేమ వ్యవహారం గురించి మీడియాలో గుసగుసలు వస్తున్నా కూడా వాటిపై వారిద్దరిలో ఏ ఒక్కరు కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఎప్పుడైతే భర్త నుండి మలైక విడాకులు తీసుకుందో అప్పటి నుండి ఇద్దరు బాహాటంగానే తిరుగుతూ కనిపించారు. అయినా కూడా ఇద్దరు తమ రిలేషన్‌ షిప్‌ పై వ్యాఖ్యలు చేయలేదు. ఇన్నాళ్లు వీరిద్దరిది అక్రమ సంబంధం అంటూ విమర్శలు చేస్తూ వచ్చిన వారికి సమాధానంగా వారి రిలేషన్‌ షిప్‌ అఫిషియల్‌ కాబోతుంది.

బాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మలైకా అరోరా మరియు అర్జున్‌ కపూర్‌ లు ఏప్రిల్‌ 19న పెళ్లి చేసుకోబోతున్నారు. బాలీవుడ్‌ కు చెందిన ప్రముఖులతో పాటు కపూర్‌ ఫ్యామిలీ నుండి పలువురు మరియు మలైకా ఫ్యామిలీకి చెందిన వారు పెళ్లి వేడుకలో హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మలైకా అరోర కంటే అర్జున్‌ కపూర్‌ వయసు చాలా తక్కువ. అయినా కూడా ప్రేమ గుడ్డిది అన్నట్లుగా ఆమెనే పెళ్లి చేసుకోవాలని అర్జున్‌ కపూర్‌ ఆశ పడుతున్నాడు. వీరిద్దరి ఇన్నాళ్ల ప్రేమకు పెళ్లి బంధం తోడు కాబోతుంది. వీరిద్దరు పెళ్లి చేసుకుంటే ఎంత కాలం కలిసి ఉంటారో నమ్మకం లేదంటూ కొందరు అప్పుడే కామెంట్స్‌ చేస్తూనే ఉన్నారు.