Begin typing your search above and press return to search.

ఆవిడ‌తో దొరికిపోయిన హీరో!!

By:  Tupaki Desk   |   8 Oct 2018 9:02 AM GMT
ఆవిడ‌తో దొరికిపోయిన హీరో!!
X
30 వ‌య‌సు కుర్ర‌హీరో.. 45 ప్ల‌స్ సీనియ‌ర్ హీరోయిన్‌తో ఎఫైర్! అంటూ అప్ప‌ట్లో బాలీవుడ్ మీడియా బోలెడంత ర‌చ్చ చేసింది. స‌ద‌రు కుర్ర‌హీరో రెడ్ హ్యాండెడ్‌ గా దొరికిపోయాడంటూ ఒక‌టే ఊద‌ర‌గొట్టుడు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. దీనిపై ప్ర‌తిసారీ మీడియాలో ప్ర‌శ్న‌ల్ని ఆ ఇద్ద‌రూ ఎదుర్కొన్నారు. సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల్లోనూ అతి పెద్ద డిబేట్ న‌డిచింది. వేడెక్కించే క‌థ‌నాలు వెబ్‌ ని అల్లేశాయి. అయితే ``ఎవ‌రి దారి వారిదే.. మ‌న దారి మ‌న‌దే`` అన్న‌ట్టుగా ఆ ఇద్ద‌రూ ప‌లుమార్లు ప‌లు వేదిక‌ల‌పై క‌నిపించి అంద‌రికీ షాకిచ్చారు. రంగుల ప్ర‌పంచంలో తార‌ల‌పై ఇలాంటి వివాదాలు స‌హ‌జ‌మే అన్న తీరుగానే ఆ ఇద్ద‌రూ ప్ర‌వ‌ర్తించ‌డం చ‌ర్చ‌కొచ్చింది.

ఇక‌పోతే ఆ ఎఫైర్ వార్త‌ల న‌డుమ మ‌లైకా అరోరాఖాన్ త‌న భ‌ర్త‌ - స‌ల్మాన్ సోద‌రుడైన ఆర్భాజ్ నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఎఫైర్ వ‌ల్ల‌నే అలా జ‌రిగింద‌ని కూడా కామెంట్లు అప్ప‌ట్లో వినిపించాయి. అయితే ఆర్భాజ్ ఖాన్ ఇటీవ‌లే క్రికెట్ బెట్టింగుల్లో దొరికిపోయిన‌ప్పుడు కొన్ని ఆస‌క్తిక‌ర నిజాలు తెలిశాయి. క్రికెట్ బెట్టింగ్‌ - హార్స్ రైడింగ్ బెట్టింగ్ వంటి చీక‌టి వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చొద్ద‌ని మ‌లైకా భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డేద‌న్న నిజాన్ని కూడా ఆర్భాజ్ విచార‌ణ‌లో పోలీసులు వెల్ల‌డించ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నమైంది.

అది పాత క‌థే అనుకుంటే.. ఇదిగో ఈ కొత్త క‌థ మ‌రింత ర‌క్తి క‌ట్టిస్తోంది. ఇటీవ‌లి కాలంలో మ‌ళ్లీ మ‌లైకా- అర్జున్ క‌పూర్ జోడీ ప‌బ్లిక్ ఫంక్ష‌న్ల‌కు ఒకే కార్‌ లో వెళుతూ క‌నిపించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. తాజాగా `న‌మ‌స్తే ఇంగ్లాండ్` ప్ర‌మోష‌న్స్‌ లో బిజీగా ఉన్న అర్జున్ క‌పూర్.. మ‌రోవైపు డిజైన‌ర్ సందీప్ కోస్లా ఇచ్చిన ఓ గ్రాండ్ నైట్ పార్టీకి ఎటెండ‌య్యాడు. అక్క‌డికి యాథృచ్ఛికంగానో, య‌థాలాపంగానో త‌న ఫ్రెండ్ కం ఫ్యాష‌నిస్టా మ‌లైకా అరోరాఖాన్‌ తో కార్‌ లో వ‌చ్చి షాకిచ్చాడు. కార్‌ లో వెన‌క‌ వైపుగా మ‌లైకా కూచుని క‌నిపించింది. దీంతో ఇంకా ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం అలానే ఉందా? ఇంకా ఎఫైర్ సాగిస్తున్నాడా?.. అంటూ గుస‌గుస‌లు వినిపించాయిట‌. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా ఈ ఫోటోల‌పైనే ఎక్కువ ఫోక‌స్ చేసి ప్ర‌చారం సాగిస్తుండ‌డంతో ర‌క‌ర‌కాల సందేహాలకు తావిస్తోంది. అయితే అయిన‌దానికి కానిదానికి ఇలా ప్ర‌చారం సాగించ‌డం క‌రెక్ట్ కాదేమో? అన్న మాటా వినిపిస్తోంది.