Begin typing your search above and press return to search.
మలైకాతో ప్యారిస్ జంప్.. అనుభవించు రాజా!
By: Tupaki Desk | 25 Jun 2022 2:30 AM GMTబాలీవుడ్ లో ఏ చిలౌట్ పార్టీ జరిగినా అక్కడ వాలిపోవడం మలైకా- అర్జున్ జంటకు పరమ రొటీన్ వ్యాపకం. ఇండస్ట్రీ హాటెస్ట్ కపుల్ గా పాపులరైన ఈ జంట నడుమ రొమాన్స్ మరో లెవల్ ని టచ్ చేస్తోందన్న గుసగుసలు ఉన్నాయి. 49 ఏజ్ మలైకాతో 36 ఏజ్ కుర్రాడి సరిగమలపై నిరంతరం హిందీ మీడియా రకరకాల కథనాలు వెలువరిస్తోంది. అయితే నైట్ పార్టీలను మించి విదేశీ విహారాలను ఈ జంట ప్రేమిస్తుంది. ఇక బర్త్ డే వేడుకలు న్యూ ఇయర్ వేడుకలు అంటూ వీలున్న ప్రతి సందర్భాన్ని విడిచిపెట్టేందుకు ఈ జంట అస్సలు సిద్ధంగా ఉండదు.
మలైకా అరోరా-అర్జున్ కపూర్ జంట ప్రతిసారీ పుట్టినరోజు వేడుకల కోసం విదేశాలకు జంప్ అవ్వడం చూస్తున్నదే. ఈసారి కూడా మలైకా అరోరా తన ప్రియుడి పుట్టినరోజు కోసం పారిస్ కు బయలుదేరారు. ఇంతకుముందే ప్రేమపక్షులు విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కారు. అయితే దీనిపై ట్రోలర్లు చెలరేగుతున్నారు. మా-బేటా (అమ్మ కొడుకు) అచ్చే లాగ్ రహే! అంటూ చెలరేగారు.
బాలీవుడ్ హాటెస్ట్ కపుల్ తమ ప్రేమ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచడానికి ప్రతిసారీ ప్రయత్నిస్తున్నా మీడియా అస్సలు విడిచిపెట్టదు. ఈసారి కూడా కెమెరా ఫ్లాష్ లు మెరిపించి ఆ ఫోటోలను వెబ్ లో షేర్ చేయడంతో ట్రోలర్స్ కి ఆహారంగా మారాయి. ఇప్పుడు అర్జున్ కపూర్ 37వ పుట్టినరోజుకు రెడీ కాగా.. స్టార్ కపుల్ అతని స్పెషల్ డేని సెలబ్రేట్ చేసుకునేందుకు పారిస్ కు వెళ్లారు. అలా వెళుతూ అర్జున్ - మలైకా ఎయిర్ పోర్ట్ లో కెమెరాలకు చిక్కారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో దుమారం రేపుతున్నాయి. చాలా మంది నెటిజనులు ఈ జంటపై అదే పనిగా ఎడా పెడా ట్రోల్ చేస్తున్నారు.
ఆ ఇద్దరి మధ్య వయస్సు తేడాను ప్రశ్నిస్తూ `మామ్ బేటా` అంటూ కామెంట్లు చేసారు. `కొడుకు- తల్లి` పుట్టినరోజును జరుపుకోవడానికి వెళుతున్నారు! అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసారు. అయితే కొందరు అభిమానులు మలైకా- అర్జున్ లను కాపాడే ప్రయత్నం చేసారు. చెత్త కామెంట్లు చేసిన వారిపై కౌంటర్లు వేసారు. చాలా మంది ఈ జంటను విమర్శించగా.. కొందరు నెటిజనులు సమర్థించారు. ఎవరైనా సంతోషంగా ఉన్నంత వరకు వయస్సు పట్టింపు లేదు! అంటూ మద్ధతుగా నిలిచారు. వయసు ఒక సంఖ్య మాత్రమేనని కూడా సమర్థించారు.
మలైకా అరోరా కొత్త లుక్ ఎయిర్ పోర్ట్ లో హాట్ టాపిక్ గా మారింది. నయా లుక్ లో మలైకా క్లాసీ గా కనిపించింది. క్రిస్టియన్ డియోర్ పొట్టి డ్రెస్ లో మలైకా హాట్ గానూ కనిపించింది. హూడీకి జతగా బూట్ల కాంబినేషన్ క్లాసీగా ఆకట్టుకుంది. అర్జున్ కపూర్ యథావిధిగా ఎయిర్ పోర్ట్ లుక్ ని సింపుల్ గా క్యాజువల్ గా ఉంచాడు. బ్లాక్ జీన్స్- నీలిరంగు టీ-షర్ట్ పై బ్లాక్ జాకెట్ ని ధరించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే ఈ జంట ఎవరికి వారు బిజీగా ఉన్నారు. అర్జున్ వరుసగా క్రేజీ చిత్రాల్లో నటిస్తుండగా. మలైకా టీవీ డ్యాన్స్ రియాలిటీ షోలతో బిజీగా ఉంది. ఫ్యాషన్ ఈవెంట్లు.. కమర్షియల్ ప్రకటనలతోనూ భారీగా ఆర్జిస్తోంది.