Begin typing your search above and press return to search.
డ్యాన్స్ షో జడ్జిగా శిల్పాజీ స్థానంలో మలైకా అరోరా
By: Tupaki Desk | 6 May 2021 2:30 AM GMTసూపర్ డాన్సర్ చాప్టర్ 4 లో న్యాయమూర్తిగా శిల్ప శెట్టి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ శిల్పా ఈ షో నుంచి కొంతకాలం పాటు విరమించారు. దీంతో ఆమె బదులుగా మలైకా అరోరా ఈ షో జడ్జిగా కొనసాగుతున్నారు. కొన్ని ఎపిసోడ్ల కోసం సూపర్ డాన్సర్ - చాప్టర్ 4 లో మలైకా అరోరా కనిపిస్తారు. ఈ వారాంతంలో మలైకాతో పాటు టెరెన్స్ లూయిస్ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొంటారు.
సూపర్ డాన్సర్ - చాప్టర్ 4 తదుపరి ఎపిసోడ్ మలైకా అరోరా న్యాయమూర్తిగా రంగ ప్రవేశం చేయడంతో ఆ మార్పు స్పష్ఠంగా కనిపిస్తుంది. శిల్పాజీ షూట్ కోసం కొత్త ప్రదేశానికి ప్రయాణించలేని పరిస్థితి ఉందిట. సూపర్ డాన్సర్ - చాప్టర్ 4 .. వారి షూటింగ్ స్థానాన్ని డామన్ కు తరలించింది. తదుపరి ఎపిసోడ్ లో మలైకాతో పాటు టెరెన్స్ లూయిస్ కూడా కనిపించనున్నారు. కలర్స్ టీవీ షేర్ చేసిన కొత్త ప్రోమోలలో మలైకా.. టెర్రెన్స్ షోలో పిల్లలతో సరదాగా గడుపుతారు.
కొత్త ప్రోమోలలో మలైకా అరోరా-టెరెన్స్ లూయిస్ యువ నృత్యకారుల ప్రదర్శనలతో మైమరచిపోతున్నారు. డ్యాన్సర్లను పొగడ్తల్లో ముంచేస్తున్నారు. టెరెన్స్ వేదికపై పోటీదారు అన్షికతో సెల్ఫీ తీసుకొని కిరీటంతో గౌరవించారు. గీతా కపూర్ -అనురాగ్ బసు కూడా ప్రోమోలలో కనిపిస్తున్నారు.
సూపర్ డాన్సర్ - 4 ఒక ఎపిసోడ్ కి శిల్పా శెట్టి - అనురాగ్ బసు వేరే షెడ్యూళ్ల కారణంగా ప్రదర్శన నుండి తప్పిపోగా.. ఫరా ఖాన్ - రెమో డిసౌజా వారి స్థానంలో వచ్చారు. అయితే ఈసారి గీతా- మలైకా అరోరాతో కలిసి అనురాగ్ తిరిగి ప్రదర్శనకు రానున్నారు. శిల్పా శెట్టి ఎప్పుడు తిరిగి వస్తారో స్పష్టంగా తెలియదు.