Begin typing your search above and press return to search.

మలైకా ఫిట్నెస్ వెనక కారణం ఇదే..

By:  Tupaki Desk   |   22 Feb 2018 7:21 AM GMT
మలైకా ఫిట్నెస్ వెనక కారణం ఇదే..
X
అందానికి వయసుకి ఏ మాత్రం సంబంధం లేదు అని ఫిల్మ్ ఇండస్ట్రీ లో చాలా మంది హీరోయిన్స్ నిరూపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితా లో ఒక 44 ఏళ్ల హీరోయిన్ చేరిపోయింది. ఆమే మలైకా అరోరా. బాలీవుడ్ సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఉండే ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా గట్టిగానే ఉంది.

ఈమె అందానికి కారణం ఏంటో తెలుసా? ఈమె ఈ వయసులో కూడా ఇంత అందంగా ఫిట్ గా ఉండటానికి కారణం యోగా అని తెలుస్తోంది. ఎలా చెప్పగలరు అనుకుంటున్నారా? ఈమధ్యనే మలైకా యోగ చేస్తున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఇందులో ఈ భామ యోగా లో ఒక కష్టమైన ఆసనం వేస్తూ కెమెరా కి చిక్కింది. కెమెరా వైపు ఓరగా చూస్తున్న ఈమె కుర్రకారు లో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమె అందం, ఆమె ఫిట్నెస్ చూసి ఎవరైనా ఈమె ఒక 17 ఏళ్ల అబ్బాయి కి తల్లి అని చెప్పగలరా?

మలైకా కు ట్రావెల్లింగ్ అంటే ప్రాణం. ఈమె సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్బాజ్ ఖాన్ ని పెళ్లి చేసుకుని విడిపోయింది. డివోర్స్ తీసుకున్నప్పటికీ ఈమె ఇంకా ఆర్బాజ్ తో స్నేహంగానే మేలుగుతుంది. జిమ్ అన్నా యోగా అన్నా కూడా ఈమెకు చాలా ఇష్టం అని ఆమెను చూస్తేనే తెలియట్లేదూ?