Begin typing your search above and press return to search.

40 దాటినా కేక తగ్గడం లేదు

By:  Tupaki Desk   |   13 July 2018 6:58 AM GMT
40 దాటినా కేక తగ్గడం లేదు
X
గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కెవ్వు కేక అంటూ ఆడిపాడిన మలైకా అరోరాను పవర్ స్టార్ ఫాన్స్ మాత్రమే కాదు నిన్నటి తరం యువతరం కూడా అంత ఈజీగా మర్చిపోలేరు. కారణం ఈ వయ్యారాలు ఇరవై ఏళ్ళ క్రితమే దిల్ సే సినిమాలో చల్ చయ్య చయ్య అంటూ షారుఖ్ ఖాన్ తో కలిసి చిందులు వేసినప్పుడే వాళ్ళు చూసి మైమరచిపోయారు కనక. నటుడు కం సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తో సుదీర్ఘ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పేసిన మలైకా మోడలింగ్ మాత్రం ఆపడం లేదు. 44 వయసు ఒంటి మీదకు వచ్చినా అసలు దాని తాలూకు ప్రభావం లేకుండా బాడీని మైంటైన్ చేస్తున్న తీరు చూస్తే ఎవరైనా వామ్మో అనాల్సిందే. ఒంట్లో ఏ కండరం పట్టు తప్పకుండా రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ చేసే మలైకా వాటి తాలూకు ఫోటోలు కూడా సోషల్ మీడియా లో షేర్ చేస్తుంటుంది.

ఇక్కడ చూస్తున్న ఫోటో అందులో భాగంగా పోస్ట్ చేసిందే. ఏదో సన్నని తీగని దండెం మీద ఆరేసి వంచినట్టు దేహాన్ని అలా మెలితిప్పుతున్న తీరు చూస్తుంటే అక్కడ ఉన్నది మలైకా అరోరానేనా అన్న అనుమానం కలగడం సహజం. 40 దాటకుండానే జవసత్వాలు కోల్పోయినట్టుగా ఉండే ఇప్పటి యూత్ కి మలైకాతో క్లాసులు ఇప్పిస్తే బెటర్ అనిపిస్తుంది కదూ. సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్పిన మలైకా త్వరలో రీ ఎంట్రీ ఇవ్వనుంది. భర్త అర్బాజ్ తో విడాకులు రద్దు చేసుకుని త్వరలో మళ్ళి కలవనుంది అనే వార్తలకు చెక్ పెడుతూ అలాంటిది ఏమి లేదని కొట్టి పారేస్తోంది. పిల్లలు చేతికి వచ్చాక విడాకులు తీసుకున్న అరుదైన జంటల్లో చేరిన మలైకా ఇంకో పదేళ్లకు పైగా ఈ ఫిట్నెస్ మైంటైన్ చేస్తానంటోంది. గ్రేటే మరి.