Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: హాటుపోజులతో చంపుతున్న మలైకం!

By:  Tupaki Desk   |   2 Aug 2019 9:42 AM GMT
ఫోటో స్టొరీ: హాటుపోజులతో చంపుతున్న మలైకం!
X
సూర్యుడి గురించి.. చంద్రుడి గురించి కొత్తగా చెప్పడం ఎంత వింతగా ఉంటుందో మన ఇండియన్ నెటిజన్లకు మలైకా అరోరా గురించి ఇంట్రో ఇవ్వడం అంత వింత అని చెప్పడం ఏమాత్రం వింత కాదు. ఇరవై అదేళ్ళకే నలభై అదేళ్ళ ఆంటీల్లా కనిపిస్తూ ఉండే ఈ పిజ్జా బర్గర్ జమానాలో నలభై ఐదేళ్ళ వయసులో ఇరవై ఐదులా కనిపించడం ఎంత కష్టమో చెప్పండి! కానీ మలైకా ఆ పనిని అత్యంత సులువుగా చేసి చూపిస్తూ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది .. అంతే కాదు లైటర్ అవసరమే లేకుండా లేకుండానే సోషల్ మీడియాలో డిజిటల్ మంటలు పెడుతోంది.

మలైకా ఈమధ్య ట్రావెల్ లీజర్ మ్యాగజైన్ ఆగష్టు కవర్ పేజికోసం ఫోటో షూట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కవర్ పేజి ఫోటోను ఆల్రెడీ తన ఇన్స్టా ఖాతాలో రెండు రోజుల క్రితమే పోస్ట్ చేసింది. తాజాగా మలైకా ఒక అడుగు ముందుకేసి ఆ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో తీసిన మరో నాలుగు ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది. బ్లాక్ కలర్ టాప్.. థై స్లిట్ గౌన్ తో ఒక బీచ్ ఒడ్డున నిలబడి ఒక పోజు.. వుడన్ ర్యాంప్ పై కూర్చుని మరో పోజు ఇచ్చింది. ఇంకో ఫోటోలో ఫ్రిల్స్ ఉండే లైట్ బ్రౌన్ కలర్ గౌన్ లో ఇసుకలో బాలీవుడ్ వేమన తరహాలో కూర్చుంది. ఏ పోజుకాపోజు ప్రత్యేకం. హాటు ఘాటు అన్నీ కలిసి ఉన్నాయి.

ఇంతకీ ఈ ఫోటోలు తీసినవారు ఎవరనుకున్నారు? 'సాహో' భామ శ్రద్ధా కపూర్ రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠ. ఫోటోలు మాత్రం కిరాక్ గా ఉన్నాయి. ఎప్పటిలాగే ఈ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఫోటోలకు వాణి కపూర్.. కరిష్మా కపూర్ లాంటి హాటు భామలు లైక్స్ కొట్టారు. సాధారణ నెటిజన్లు "నువ్వు ముంబైకి లైట్ హౌస్".. "కాలేజీల్లో నీతో ఫిట్నెస్ పాఠాలు చెప్పించాలి".. "హాటెస్ట్ క్వీన్ ఆన్ ఇన్స్టా" అంటూ అసాధారణమైన కామెంట్లు పెట్టారు.