Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: మినీ నిక్కర్లో మలైకం హొయలు

By:  Tupaki Desk   |   31 Oct 2019 2:02 PM GMT
ఫోటో స్టోరీ: మినీ నిక్కర్లో మలైకం హొయలు
X
బాలీవుడ్ లో లేటు వయసు హాటు బ్యూటీల లిస్టులో నంబర్ వన్ ప్లేసు సాధించే భామ మలైకా అరోరా. ఆ హాట్ నెస్.. ఆ స్టైల్.. ఆ బికినీ షేప్ అతి తక్కువమందికి ఉంటుంది. అందుకే మలైకాకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. తను స్వయంగా పోస్ట్ చేసే ఫోటోలే కాకుండా ఇతర ఫోటోలు కూడా వైరల్ అవుతుంటాయి. ఇలా బయట కనిపించిన సమయంలో తీసిన ఫోటోలను వైరల్ భయాని లాంటివారు తమ ఇన్స్టా పేజిలో షేర్ చేస్తూ హాటుభామలు నెటిజన్లను కాల్చుకు తినే మంటలో కాస్త పెట్రోలు.. డీజిలు పోస్తుంటారు.

రీసెంట్ గా ఇతగాడు తన ఇన్స్టా ఖాతాలో ఒక మలైకా ఫోటో ఒకటి పోస్ట్ చేశాడు. ఈ ఫోటో ఒక్కటి కాదు.. మూడు ఫోటోల మల్టిస్టారర్. స్కిన్ టైట్ వైట్ టీ షర్టు.. అంతకంటే స్కిన్ టైట్ వైట్ కలర్లో లైట్ డిజైన్ ఉండే మినీ ధరించి స్టైలుగా కారు దగ్గరకు నడుచుకుంటూ వెళ్తోంది. తలకు కొప్పు కట్టింది. కొప్పు అనగానే అప్పలమ్మలు కట్టే పిచ్చకొప్పు అనుకుంటారేమో.. కాదు కాదు. ఆ కొప్పు కూడా యమా స్టైలిష్. వీటికి తోడూ మిలమిల మెరుస్తున్న మోడరన్ గాగుల్స్.. చేతిలో పసుపు రంగు సిప్పర్ బాటిల్.. కాళ్ళకు వైట్ కలర్ క్యాజువల్ స్లిప్ ఆన్స్ ధరించి వయ్యారం.. సింగారం.. అన్నీ ఒలకబోస్తూ ఒకలాంటి సిలకనవ్వు రువ్వుతూ వెళ్తోంది. అసలు ఒంపులు సొంపులు అనే పదాలు ప్రపంచంలో ఎవైనా ఉంటే వాటిని మలైకాను వర్ణించడానికే వాడాలి.

ఈ ఫోటోకు స్వయంగా మలైకానే ఓ లైక్ వేసుకుంది. ఈ ఫోటోను పోస్ట్ చేయడమే ఆలస్యం.. లైకులతో కామెంట్లతో ఇన్స్టాగ్రామ్ హోరెత్తింది. "సీనియర్ జాన్వి" "ఆల్వేస్ హాట్ అరోరా".. "సూపర్ సెక్సీ లేడీ" అంటూ కొందరు నెటిజన్లు రెచ్చిపోయారు. అయితే ఒకరు మాత్రం ఘాటుగా "ఈ ముసలమ్మ ఎవరు?" అంటూ పంచ్ విసిరాడు. కళాపోషకుడికి ఏం నచ్చలేదో.. ఎక్కడ కాలిందో ఎవరికి తెలుసు?.. ప్రాబబ్లీ అర్జున్ మైట్ నో దిస్ ఇన్ఫో!

Pic Courtesy: Viral Bhayani