Begin typing your search above and press return to search.

వీడియో: యంగ్ హీరోకి కునుకే క‌రువు ఇందుకే!

By:  Tupaki Desk   |   25 March 2019 5:30 PM GMT
వీడియో: యంగ్ హీరోకి కునుకే క‌రువు ఇందుకే!
X
గ‌త కొంత‌కాలంగా మ‌లైకా అరోరాఖాన్ - అర్జున్ క‌పూర్ ఎఫైర్ వ్య‌వ‌హారం వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రి పెళ్లి గురించి ముంబై ఫిలిం వ‌ర్గాలు స‌హా దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ సాగుతోంది. ఈ ఏప్రిల్ లోనే పెళ్లికి రెడీ అవుతున్నార‌ని, ఆ వేడుక‌ను ప్ర‌యివేట్ ఎఫైర్ గా పూర్తి చేయాల‌ని భావిస్తున్నార‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. మ‌రోవైపు మ‌లైకా - అర్జున్ ఎవ‌రికి వారు కెరీర్ ప‌రంగా బిజీ బిజీ గా ఉన్నా.. ముంబైలో ఆ ఇద్ద‌రూ క‌లిసే షికార్లు చేస్తున్నారు. దేశ‌ - విదేశాల‌కు వెళ్లి వ‌స్తున్నారు. సాయంత్రాలు - లేట్ నైట్ డిన్న‌ర్లు అంటూ ఇప్ప‌టికే ముంబైలో ప‌లుమార్లు మీడియా కంటికి చిక్కారు.

మ‌రోవైపు మ‌లైకా ఫ్యాష‌న్ ఈవెంట్ల‌లోనూ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఇండ‌స్ట్రీ బెస్ట్ స్టైల్ ఐక‌న్ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకుంటోంది. ప్ర‌ఖ్యాత ముంబై టైమ్స్ ఫ్యాష‌న్ వీక్ లో మ‌లైకా ర్యాంప్ వాక్ యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. టాప్ టు బాట‌మ్ రెడ్ క‌ల‌ర్ ఛ‌మ్కీల డ్రెస్ లో మ‌లైకా క్యాట్ వాక్ చేసిన తీరు మైమ‌రిపించింది. ఇక ఈ అమ్మ‌డు 45 వ‌య‌సులోనూ ఎక్క‌డా ఫ్యాష‌న్ ప‌రంగా ఏమాత్రం తగ్గ‌డం లేదు. మ‌లైకా లోని ఈ డేరింగ్ లుక్ కి అర్జున్ క‌పూర్ ప‌డిపోయాడ‌ని భావించ‌వ‌చ్చు.

మ‌లైకా- అర్జున్ ఎఫైర్ తో పాటుగా ఈ లేటు వ‌య‌సు సుంద‌రి అంద‌చందాల‌పైనా - తాను అనుస‌రించే ఫ్యాష‌న్స్ పైనా నెటిజ‌నుల్లో వేడెక్కించే చ‌ర్చ సాగుతోంది. ఓ అభిమాని మ‌లైకా అందం అంత‌కంత‌కు పెరుగుతోంది అంటూ వ్యాఖ్యానిస్తే - వేరొక అభిమాని ఇంకా బెబో క‌రీనా ఫ్యాష‌న్స్ ని మ‌లైకా అనుస‌రిస్తోంద‌ని కామెంట్ ని పోస్ట్ చేశాడు. ఇక ఈ వీడియోలో మ‌లైకా అరోరాఖాన్ కిల్లింగ్ లుక్ విష‌యంలో పొగ‌డ్త‌లు క‌నిపించాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి