Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: మలైకా యురేకా కకా మికా
By: Tupaki Desk | 11 April 2019 7:22 AM GMTఏదో ఒక వేడెక్కించే వ్యవహారంతో నిరంతరం పబ్లిక్ కి టచ్ లో ఉండడం మలైకా అరోరాఖాన్ అలవాటు. ఒకసారి ఎఫైర్ వార్త.. ఇంకోసారి టూపీస్ వార్త.. మరోసారి బికినీ బీచ్ విహారానికి సంబంధించిన వార్త.. ఓవరాల్ గా కవ్వింతకు తుళ్లింతకు సంబంధించిన ఏదో ఒక ప్రచారంతో నిరంతరం మీడియాని వేడెక్కిస్తూనే ఉంది.
నిన్నటిరోజున బికినీ బీచ్ లో కన్ను గీటి.. వేలు చూపిస్తూ ... మీరు ఎలా చింతిస్తే నాకేంటి? నా స్వేచ్ఛ.. నా సంతోషం .. నా ఇష్టం!! అంటూ టీజ్ చేసింది. అర్జున్ కపూర్ తో తన స్వేచ్ఛా విహారాన్ని సమర్ధించుకునేలా సామాజిక మాధ్యమాల్లో నెటిజనులతో గొడవలు పెట్టుకుంది. అది గతం అనుకుంటే ఇంతలోనే వర్తమానంలో అదిరిపోయే ఫోటో షూట్ తో హీటెక్కించింది. పసుపు పచ్చ డిజైనర్ డ్రెస్ లో మ్యాంగో బేబీలా తళతళలాడిపోయింది మలైకా.
పసుపు రంగు పూసుకున్న రాణీ హంస ఒకటి నీళ్లలో తేలియాడుతూ రెక్కలు టపటపా కొట్టుకుంటున్న చందంగా మలైకా ఇచ్చిన ఆ ఫోజు కుర్రకారు గుండెల్లోకి సూటిగా దూసుకెళ్లిపోయింది. ఈ లుక్ కి స్టన్నింగ్.. మైండ్ బ్లోయింగ్.. మిరాకిల్! అంటూ ఫ్యాన్స్ ఒకటే పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 40 ప్లస్ లోనూ మలైకా అగ్గి రాజేస్తున్న తీరుకు యూత్ ఒకటే వాడి వేడిగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఈ గౌనును ఫ్యాషన్ డిజైనర్లు ఏమని పిలుస్తున్నారు? అంటే .. `సన్ షైన్ ఎల్లో స్ట్రాప్ లెస్ సిల్క్ ప్లేటెడ్ గౌన్` అంటూ చాలా పెద్ద పేరే పెట్టారు. ఆ డ్రెస్ కి కాంబినేషన్ హైహీల్స్ అంతే ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ప్రియుడితో కలిసి మాల్దీవులు వెళ్లిన మలైకా అప్పటికప్పుడే క్షణమైనా తీరిక లేకుండా ఫోటో షూట్లలో ఎలా పాల్గొంలోందో కానీ.. అసలు ఊపిరి సలపనిచ్చేట్టే లేదు సుమీ.