Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఆమె క‌నిపిస్తే చాలు క‌ళ్ల‌ప్ప‌గిస్తున్నారు!

By:  Tupaki Desk   |   3 Dec 2020 4:30 AM GMT
ఫోటో స్టోరి: ఆమె క‌నిపిస్తే చాలు క‌ళ్ల‌ప్ప‌గిస్తున్నారు!
X
బాలీవుడ్ ఫ్యాష‌నిస్టా మ‌లైకా ఇస్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో మ‌లైకా చెల‌రేగుతున్న తీరు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారుతోంది. 47ఏళ్ల వ‌య‌సులో ఈ భామ హాటెస్ట్ లుక్ ట్రెండీగా చ‌ర్చ‌ల్లోకొస్తోంది.

ప‌ర్ఫెక్ట్ జిమ్ యోగాతో 25 ఏజ్ అంద‌గ‌త్తెలా మ‌లైకా త‌న రూపాన్ని మెయింటెయిన్ చేయ‌డంపై యువ‌త‌రం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తోంది. ఈ రెండ్రోజుల్లోనే మ‌లైకా స్పోర్ట్స్ స్టార్ అవ‌తారం హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా మలైకా అరోరా తన జిమ్ వెలుపల కెమెరా ఫ్లాష్ ల‌కు చిక్కింది. ఈ ఫోటోలలో ఆరెంజ్ కలర్ స్పోర్ట్స్ బ్రా మ్యాచింగ్ లెగ్గింగ్స్ లో కుర్రాకారు గుండెల్లో గుబులు రేపింది. బ్లాక్ అండ్ ఆరెంజ్ స్పోర్ట్స్ షూస్ ‌తో టాప్ టు బాట‌మ్ మ్యాచింగ్ ని ఫాలో అవ్వ‌డం ఆస‌క్తిక‌రం. ఆమె భవనం ప్రాంగణం నుండి బయటకు వచ్చిన తర్వాత తన వ్యాయామ సెషన్ ను ముగించింది. మ‌లైకా ఇటీవ‌ల డ్యాన్స్ రియాలిటీ షోల‌కు జ‌డ్జిగా కొన‌సాగ‌డ‌మే గాక‌.. వ‌రుస‌గా క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల‌తోనూ బిజీ అవుతోంది.