Begin typing your search above and press return to search.
వీడియో : రోడ్డు పై హీరోయిన్ కి చేదు అనుభవం
By: Tupaki Desk | 19 May 2023 6:12 PM GMTసెలబ్రెటీలు కొన్ని సార్లు తమకు ఉన్న పాపులారిటీ కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. బయట అడుగు పెట్టలేని పరిస్థితి ఉంటుంది. అభిమానులం అంటూ మీద మీద పడుతూ ఉంటారు. కొందరు మరో రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. రోడ్డు మీద సెలబ్రెటీ కనబడితే చాలు సెల్ఫీ అంటూ ఈ మధ్య ఫోన్ లు బయటకు తీస్తున్నారు.
తాజాగా ముంబై రోడ్ల మీద హీరోయిన్ మలైకా అరోరాకి చేదు అనుభవం ఎదురైంది. ఒక మాల్ కు వెళ్లి వస్తున్న సమయంలో మలైకాను కొందరు అమ్మాయిలు చుట్టుముట్టారు.
వారు అడుక్కునే వారా లేదంటే మరెవ్వరైనా అనేది తెలియడం లేదు.. కానీ వారు మలైకాను చాలా ఇబ్బంది పెట్టినట్లుగా వీడియోను చూస్తే అర్థం అవుతుంది.
వీడియో ను చూసిన చాలా మంది మలైకా అరోరా కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలను కూడా సాధారణ జనాల మాదిరిగా చూడాలని.. వారికి పర్సనల్ లైఫ్ ఉంటుందనేది గుర్తించాలని కొందరు విజ్ఞప్తి చేశారు.
మలైకా అరోరా ను రోడ్డు మీద ఇబ్బంది పెట్టిన ఆ అమ్మాయిల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

ఇక కొందరు మాత్రం మలైకా అరోరా తీరును తప్పుబడుతున్నారు. అమ్మాయిలు ఏదో అడుగుతూ ఉంటే పట్టించుకోకుండా వెళ్లడం ఎంత వరకు కరెక్ట్.. అమ్మాయిలు ధీనంగా కారు గ్లాస్ నుండి కూడా మలైకా దీదీ అంటూ పిలుస్తున్నా కూడా ఆమె పట్టించుకోక పోవడం దారుణం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.