Begin typing your search above and press return to search.

మళ్ళి అదరగొట్టిన కెవ్వు కేక పోరి

By:  Tupaki Desk   |   11 Sep 2018 8:53 AM GMT
మళ్ళి అదరగొట్టిన కెవ్వు కేక పోరి
X
గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సరసన కెవ్వు కేక అంటూ హోరెత్తించిన మలైకా అరోరా వయసు పెరిగే కొద్ది గ్లామర్ ను వెనక్కు తీసుకెళుతోంది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ తో బంధం విడాకుల దాకా వచ్చి విడిపోయినా సినిమాల పరంగా ఏ మాత్రం తగ్గడం లేదు ఈ 44 ఏళ్ళ ఏజ్ లెస్ సుందరి. తాజాగా పటాకా అనే సినిమాలో హలో హలో అంటూ చేసిన ఐటెం సాంగ్ ఇప్పుడు ఆన్ లైన్ లో రచ్చ చేస్తోంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో ఇదొక ప్రధాన ఆకర్షణగా మిగలనుంది. మలైకా చేయటం అని కాదు కానీ ఇంత వయసులోనూ శరీరాన్ని మెలితిప్పుతున్న తీరు చూస్తే నలభై పడిలో ఉన్నవాళ్లు సిగ్గు పడటం ఖాయం. అంత ఫిట్ నెస్ బాడీలో చూపడం అంటే మాటలు కాదుగా. పైగా టీనేజ్ వయసుకు వచ్చిన పిల్లలున్న తల్లి మలైకా అంటే ఎవరైనా బయటివాళ్ళు నమ్మడం అసాధ్యం అనే రీతిలో మలైకా రచ్చ చేస్తోంది.

ఒకవిధంగా చెప్పాలంటే మలైకా హీరోయిన్ గా కాకపోయినా ఇలా ఐటెం సాంగ్స్ తో పాటు మోడలింగ్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది. పటాకా కాన్సెప్ట్ బాగా నచ్చడం వల్లే ఈ పాట చేయడానికి ఒప్పుకున్నాను అని చెప్పిన మలైకా గణేష్ ఆచార్య కంపోజ్ చేసిన స్టెప్స్ కి కొత్త అందం తీసుకొచ్చింది. వారం తిరక్కుండానే మిలియన్ వ్యూస్ దాటేసింది అంటే దీని గురించి ప్రత్యేకంగా చెప్పాలా. పటాకా మూవీ ఇద్దరు విభిన్నమైన మనస్తత్వం కలిగిన అక్కా చెల్లెళ్ళ కథతో రూపొందింది. సాన్య మల్హోత్రా-రాధికా మదన్ కీలక పాత్రల్లో రూపొందిన పటాకా ఈ నెలాఖరున విడుదల కానుంది. ఈ ఒక్క పాటతో ఇప్పటికే ఉన్న అంచనాలు పెరిగిపోయాయి. అయినా మలైకా అరోరా మందిరా బేడీ లాంటి వాళ్ళు నలభైలు దాటుతున్నా ఇంత ఫిట్ గా ఎలా ఉంటున్నారో ఆ సీక్రెట్ పంచుకుంటే ఎంత బాగుంటుందో.