Begin typing your search above and press return to search.

మ‌లైకా దెబ్బ‌కు మిస్సిండియాలు గ‌ల్లంతే

By:  Tupaki Desk   |   4 July 2022 4:43 AM GMT
మ‌లైకా దెబ్బ‌కు మిస్సిండియాలు గ‌ల్లంతే
X
బాలీవుడ్ హాట్ గాళ్ మలైకా అరోరాకు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. నేటిత‌రానికి నిరంత‌రం ట్రెండ్ అంటే ఏంటో నేర్పిస్తూ బోలెడంత ఫాలోయింగ్ పెంచుకుంది. మ‌లైకా ఫ్యాష‌న్ సెన్స్.. బోల్డ్ నెస్ గురించి నిరంత‌రం అభిమానుల్లో ముచ్చ‌ట సాగుతూనే ఉంది. వ‌య‌సు 50 కి చేరువ‌వుతున్నా మ‌లైకాలోని మిస‌మిస‌ల గురించి నిరంత‌ర చ‌ర్చ వేడెక్కిస్తూనే ఉంటుంది. స‌రిగ్గా ఇవే ల‌క్ష‌ణాలు త‌న‌ని మిస్ ఇండియా 2022 పోటీల‌కు జ‌డ్జిగా మ‌లిచాయి. ఈ సంవత్సరం మిస్ ఇండియా పోటీల జ్యూరీలో నేహా ధూపియా- మలైకా అరోరా లాంటి టాప్ మోడ‌ల్స్ కం న‌టీమ‌ణులు ఉన్నారు. మోడల్ కం న‌టుడు డినో మోరియా.. డిజైనర్లు రోహిత్ గాంధీ -రాహుల్ ఖన్నా... డ్యాన్సర్ కం కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్ .. క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా జ్యూరీలో ఉన్నారు.

తాజాగా మిస్ ఇండియా ఈవెంట్ కి హాజ‌రైన మ‌లైకా అదిరిపోయే లుక్ తో క‌ట్టి ప‌డేసింది. తన వంపు సొంపులను బంగారు గౌనులో రంగ‌రించింది. ఆదివారం నాడు మిస్ ఇండియా రెడ్ కార్పెట్ పై మలైకా అరోరా అద్భుతమైన ఎంట్రీ ఇచ్చింది. ఆమె తన తాజా బోల్డ్ అవతార్ లుక్ తో అందరి దృష్టినీ ఆకర్షించింది. మలైకా అరోరా షీర్ మ్యూట్ గోల్డ్ ఎంబ్రాయిడరీ గౌను ధరించి టోన్డ్ బాడీని మెరిపించింది. మలైకా అరోరా మెరిసే బంగారు వ‌న్నె గౌనులో ఆకర్షణీయంగా కనిపించింది. మ‌లైకా హాటెస్ట్ లుక్ ప్రదర్శనకు అభిమానులు స్నేహితులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

అభిమానుల్లో ఒకరు ఈ ఫోటోలపై స్పందిస్తూ ``కిమ్ కర్దాషియాన్ వైబ్స్ ఇస్తోంది`` అని పొగిడేసారు. బంగారు - ఆకుపచ్చ రంగు నెక్ పీస్ చేతి వేళ్ల‌కు ఉంగ‌రాల‌తో తన రూపాన్ని మ‌రో లెవ‌ల్లో మ‌లైకా ఆవిష్క‌రించుకుంది. సాసీ గోల్డెన్ దుస్తులలో మ‌లైకా పూర్తి స్టన్నర్ గా కనిపించింది.

మలైకా అరోరా వ్యక్తిగత వృత్తిపరమైన స‌మాచారం కోసం ఆత్రుత‌ప‌డే అభిమానులు త‌న‌కు ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్‌లో 15.2 మిలియన్లకు పైగా అనుచరులతో మల్లా (స్నేహితులు పిలుచుకునే ముద్దు పేరు) సోషల్ మీడియాలో ది బెస్ట్ అని నిరూపించారు. నిరంత‌రం వేడెక్కించే ఫోటోలు.. వీడియోలను క్రమం తప్పకుండా షేర్ చేయడం ద్వారా తన ఇన్ స్టా ఫ్యామిలీకి బోలెడంత‌ వినోదం పంచుతోంది. 48 ఏళ్ల డ్యాన్సింగ్ క్వీన్ తన ఇంటి నుండి బయటికి వచ్చిన ప్రతిసారీ హెడ్ ట‌ర్న‌ర్ గా నిలుస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. టోన్డ్ బాడీని మెయింటెయిన్ చేయడం మొద‌లు తన స్టైల్ గేమ్ తో కుర్ర‌కారు ఐబాల్స్ ని క్యాచ్ చేయడంలో రియ‌ల్ సెన్స్ ఉన్న టాప్ ఫ్యాష‌నిస్టాగా మ‌లైకా పేరు విన‌ప‌డుతోంది. మ‌లైకా డ్యాన్స్ రియాలిటీ షోల‌కు జ‌డ్జిగా కొన‌సాగుతూ.. క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ భారీగా ఆర్జిస్తోంది. త్వ‌ర‌లోనే త‌న వార‌సుడిని హీరోని చేసేందుకు ఇప్ప‌టి నుంచే భారీ ప్ర‌ణాళిక‌ల‌తో ఉంది. యువ‌హీరో అర్జున్ క‌పూర్ తో ప్రేమాయ‌ణం నిరంత‌రం హెడ్ లైన్స్ లో నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే.