Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: అల్ట్రా స్టైలిష్ ఆంటీగారు!

By:  Tupaki Desk   |   20 Nov 2018 2:30 PM GMT
ఫోటో స్టొరీ: అల్ట్రా స్టైలిష్ ఆంటీగారు!
X
ఎవరైనా పాతికేళ్ళప్పుడు హాటుగా ఉంటారు. మహా అయితే ముప్పై అయిదు. ఇంకా కొన్ని గ్రేస్ మార్కులు కలిపితే నలభై. ఇప్పటికే కొంతమంది నలభైల్లో ఉన్న విశ్వ సుందరి.. ప్రపంచ సుందరి బ్యాచ్ బ్యూటీలు మేకప్ మీదే ఎక్కువగా డిపెండ్ అవుతున్నారని టాక్ ఉంది. కానీ మలైకా అరోరా మాత్రం అలా కాదు. వయసేమో 45.. వ్యవహారం చూస్తే జాన్వి.. ఖుషిలతో పోటీకి సై అనేలా ఉంది.

అసలే కసరత్తులు చేస్తూ.. కఠినమైన డైట్ ను ఫాలో అవుటూ ఉంటుంది కదా. బూతద్దం.. సారీ భూతద్దం.. పెట్టి వెతికి చూసినా ఒక్క మిల్లీ గ్రాము కూడా ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా కనపడదు. అంత ఫిట్టు. ఇక స్లిమ్ గా ఉండడంతో 20 ఏళ్ళ పడుచు పిల్లలు వేసుకునే డ్రెస్సులు వేసుకుని మరీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రీసెంట్ గా అదే పని చేసింది. చిరుగుల జీన్స్.. మీరు దాన్ని స్టైల్ గా ఇంగ్లీష్ లో ష్రెడ్డెడ్ జీన్స్ అంటారో.. లేదా టోర్న్ జీన్స్ అంటారోగానీ ఆ జీన్లో కనిపించింది. ఒక స్టైలిష్ వైట్ కలర్ ఇన్నర్. షార్ట్ జీన్స్ జాకెట్. అల్ట్రా స్టైలిష్ అంటే నమ్మండి. సాధారణంగా ఒకటి రెండు చిరుగులు ఉంటే క్యారీ చేయడం సాధ్యమే గానీ ఎలకలు కొరికినట్టుగా ఉన్న ఈ జీన్స్ ను ఓ యాటిట్యూడ్ తో ధరించడం మాత్రం గ్రేటే.

సోషల్ మీడియా లో ఇప్పటికే ఈమె లుక్కుకి ఫుల్ మార్క్స్ పడ్డాయి. అయినా.. అన్నీ అందరికీ నచ్చాలని లేదు కదా... ఆ జీన్సేంది.. నీ ఏజ్ ఏంది అని కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదేమైనా హాలీవుడ్ నటీమణులు చేసే వ్యవహారాన్ని.. వాళ్ళ డ్రెస్ స్టైల్ ని మలైకా ముంబైకి తీసుకొచ్చింది.

Photo Credit: Viral Bhayani