Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మలైకా ఎక్కడా ఆగట్లేదు

By:  Tupaki Desk   |   25 Jun 2018 10:19 AM GMT
ఫోటో స్టోరి: మలైకా ఎక్కడా ఆగట్లేదు
X
కొప్పున పూలెట్టుకుని.. బుగ్గన ఏలెట్టుకుని.. అంటూ తన స్టెప్పులతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేసి కెవ్వు కేక అనిపించిన బ్యూటీ మలైకా అరోరా. ఏజ్ పెరిగినా బ్యూటీ తరగని భామల లిస్టు ఒకటి తయారు చేస్తే అందులో మలైకా పేరు మొదట్లోనే ఉండి తీరాలి. యంగ్ ఏజ్ లో మేని మిసమిసలతో ఎలా మైమరిపించిందో మిడిల్ ఏజ్ లో ఇప్పటికే అదే స్థాయిలో మత్తెక్కించగలగడం మలైకాకు మాత్రమే తెలిసిన విద్య.

తాజాగా మలైకా సోషల్ మీడియాలో తన ఫొటో ఒకటి అభిమానుల కోసం షేర్ చేసింది. అవడానికి ఇది డ్యాన్సింగ్ స్టిల్లే అయినా అందాలన్నీ ధారళంగా ఆరబోసేసింది. బ్లాక్ టాప్ లో మలైకా అందాలు చూసి మతి పోగొట్టుకోని వాళ్లు ఉండరంటే ఎంతమాత్రమూ తప్పు కాదు. ఎవరూ చూడట్లేదనుకుంటే ఎలా చిందేస్తామో అలా డ్యాన్స్ చేయాలంటూ కామెంట్ కూడా యాడ్ చేసింది. ప్రపంచంలో ఏది ఆగినా.. మలైకా టీజింగ్ మాత్రం ఆగట్లేదు. ఈ ఫోజులో ఆమెను చూశాక మరోసారి నోటివెంట కెవ్వు కేక పాట వచ్చేస్తుంది.

మలైకా అరోరా ఈ మధ్య బాలీవుడ్ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ ఈ రోజుకూ ఆమె ఫొటో షూట్లు చేస్తూనే ఉంది. వాటికి విపరీతమైన పాపులారిటీ వస్తోంది. లేటు వయసులో ఇంత గ్లామర్ మెయిన్ టెయిన్ చేయడమే కాదు.. దానిని స్పైసీగా చూపించడంలోనూ మలైకా మించిన వారెవరూ ఉండరని గ్యారంటీగా చెప్పేయొచ్చు.