Begin typing your search above and press return to search.

బావగారి సినిమా చూడకూడదనే హాలీడే!!

By:  Tupaki Desk   |   12 July 2016 12:02 PM GMT
బావగారి సినిమా చూడకూడదనే హాలీడే!!
X
బాలీవుడ్డులో ఇప్పుడు రెండే డిస్కషన్లు. అయితే సుల్తాన్ సినిమా గురించి మాట్లాడుకోవడం.. లేదంటే ఈ 40 ఏళ్ల ఆంటీ వేసుకున్న బికినీల గురించి గంటలు గంటలు చెప్పుకోవడం. ఇకపోతే అసలు ఈ అమ్మడు ఇప్పుడు ఉన్నట్లుండి సమ్మర్ కూడా పూర్తయ్యాక మాల్డీవ్స్ హాలిడేకు ఎందుకు వెళ్ళింది అనే కోణంలో బాలీవుడ్ చెవులు కొరికేసుకుంటోంది. పదండి ఓ లుక్కేద్దాం.

గత నాలుగు రోజులుగా మాల్డీవ్స్ ఫోర్ సీజన్స్ రిసార్టులో ఎంజాయ్ చేస్తున్న సెక్సీ మోడల్‌ మలైకా అరోరా ఖాన్‌.. బికినీలో సేదతీరుతా ఆ ఫోటోలన్నీ నెట్ లో పెట్టేస్తోంది. పక్కనే ఆమె కొడుకు కూడా కనిపిస్తున్నాడులే. అయితే ఇంత హాటుగా ఇప్పుడు బాలీవుడ్ లో ఉన్న ఏకైక మ్యారీడ్ మథర్ అంటే మన మలైకానే. ఇక మ్యాటర్ లోకి వెళితే.. ఆల్రెడీ ఒక ప్రక్కన మొగుడు అర్భాజ్ ఖాన్‌ తో ఏవో గొడవలు వచ్చి వేరుగా ఉంటోందనే టాక్‌ ఉంది. ఇప్పుడు కరెక్టుగా బావ గారు సల్మాన్‌ ఖాన్‌ ''సుల్తాన్'' సినిమా విడుదలైంది. ఈ సమయంలో ఇక్కడుంటే ఎక్కడ సినిమా చూసి బావగారికి కంగ్రాట్స్ అనో.. లేక ఫీడ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుందనో.. అమ్మడు ఇలా హాలిడేకు చెక్కేసిందా?

బాలీవుడ్ లో ఇదే డౌటు చాలామందికి వస్తోంది. అసలు సమ్మర్ మొత్తం పూర్తయిపోయి.. ఇప్పుడే వానల్లో భారతదేశం తడిసిపోతుంటే.. ఈ టైములో మాల్డీవుల్లో వెకేషన్‌ ఏంటో మరి. ఏదేమైనా కూడా మొగుడితో విడిపోతుంది అన్నప్పటి నుండి మలైకా అనేక సంచలనాలకు కేంద్ర బింధువైంది.