Begin typing your search above and press return to search.

40 ప్లస్ లో ఈ హాట్ బ్యాటింగ్ ఏంటంటా..

By:  Tupaki Desk   |   8 Nov 2016 9:30 AM GMT
40 ప్లస్ లో ఈ హాట్ బ్యాటింగ్ ఏంటంటా..
X
పెరుగుతున్న వయసుని ఎంత దాచాలన్నా దాచలేం. ఫేస్ లో.. బాడీలో ఏజ్ ఇంపాక్ట్ కనిపిస్తూనే ఉంటుంది. కానీ అందరి విషయంలో ఇదే రూల్ అప్లై అవుతుందని కూడా చెప్పలేం. చాలా కొద్దీ మందికి ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే. వాళ్ల హాట్ బాడీస్ చూస్తే వీళ్ల యవ్వనం పాజ్ బటన్ కొట్టి ఆగిపోయిందేమో అనిపిస్తోంది. బాలీవుడ్ వెటరన్ బ్యూటీ మలైకా అరోరా ఖాన్ ఉంది చూశారూ సరిగ్గా ఈ కేటగిరీనే అనుకోవాలి.

చెప్పుకోడానికి 40 ప్లస్ అయినా.. అస్సలు అలా కనిపించదు మలైకా. పెద్దగా సినిమాలు చేయకపోయినా ఎప్పుడూ వార్తల్లో ఉండటం ఈ హాట్ బ్యూటీ హాబిట్. ఇక కాస్త గ్యాప్ ఇచ్చి వదిలే ఫోటోలు మలైకాని న్యూస్ మేకర్ చేస్తుంటాయ్. లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఓ పిక్- ఈ ఛయ్యా ఛయ్యా భామలో హాట్ నెస్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పకనే చెబుతోంది. బ్యాగ్రౌండ్ ని బట్టి ఏదో రెస్టారెంట్ కి వెళ్లినప్పుడు సరదాగా దిగినట్టుంది. కానీ పోజు మాత్రం చంపేసింది.

బ్లాక్ టాప్.. అలివ్ గ్రీన్ స్కర్ట్ లో గ్రీక్ శిల్పంలా నిల్చొని ఓ ఫోటో దిగి దానికి బీ యువర్ సెల్ఫ్ అంటూ ఓ ట్యాగ్ లైన్ యాడ్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది. అంత హాట్ పోజుచ్చిన తర్వాత బీ యువర్ సెల్ఫ్ అంటే ఎవరు మాత్రం ఆగుతారు. అందుకే ట్యాగ్ లైన్ ని లైట్ తీసుకోని లైక్ ల మీద లైక్ లు కొట్టేస్తున్నారు చూసినవారంతా. రాంగ్ రీజన్స్ తో న్యూస్ లోకి వచ్చినప్పుడల్లా దాన్ని కవర్ చేయడానికి ఓ స్పైసీ స్టిల్ వదలడం మలైకాకి అలవాటే. చేసేదంతా చేస్తూ బీ యువర్ సెల్ఫ్ అంటే ఎవరికీ మాత్రం ఎక్కుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/